నిరుద్యోగులకు శుభవార్త… బాబు మరో వరం

chandra-babu

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల వయోపరిమితిని పెంచుతూ సీఎం చంద్ర బాబు నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థుల వయోపరిమితిని

42 ఏళ్ళ కు పెంచారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం విడుదల ఈ రోజు విడుదల చేయనుంది. ఇకనుంచి విడుదల చేయనున్న గ్రూప్స్ నోటిఫికేషన్స్ కి ఈ వయోపరిమితి పెంపు వర్తించనుంది. బాబు వస్తే జాబ్ వస్తుంది ఇది టీడీపీ ఎన్నికల నినాదం. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు దీనిని కూడా రాజకీయం చేస్తున్నాయి. బాబు వచ్చారు మరి జాబ్స్ ఏవి అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీసుకున్న వయోపరిమితి పెంపు నిర్ణయం నిరుద్యోగులతో పాటు బాబు కి ప్రయోజనం కానుంది.

Loading...

Leave a Reply

*