క‌ష్ట స‌మ‌యంలో రిజ‌ర్వ్ బ్యాంక్ బంప‌ర్ ఆఫ‌ర్‌….!

untitled-5

పెద్ద నోట్ల ర‌ద్దు కొంద‌రికి క‌ష్టాల‌ను మిగిల్చితే.. మ‌రికొంద‌రికి బంప‌ర్ ఆఫర్‌ల‌ను తీసుకు వ‌స్తోంది. కొన్నాళ్లుగా పాత నోట్లు చెల్ల‌క‌పోవ‌డం, కొత్త నోట్లు మార్కెట్‌లో పూర్తికి చెలామ‌ణిలోకి రావ‌డానికి టైమ్ ప‌ట్టే సూచ‌న‌లు క‌నిపిస్తుండ‌డంతో ఆర్‌బీఐ అప్పులవాళ్ల‌కి బంప‌ర్ ఆఫర్ ప్ర‌క‌టించింది. కోటి రూపాయ‌ల వ‌ర‌కు తీసుకున్న గృహ‌రుణం, కారు రుణం, పంట రుణాలు.. ఇత‌ర రుణాల‌ను చెల్లించ‌డానికి మ‌రో 2 నెల‌లు అద‌న‌పు గ‌డువు ఇచ్చింది.

న‌వంబ‌ర్ 1వ తేదీ నుంచి డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు చెల్లించాల్సిన అన్ని ర‌కాల రుణాల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని ఆర్‌బీఐ ప్ర‌క‌టించింది. కోటి రూపాయ‌లలోపు వ‌ర్కింగ్ క్యాపిట‌ల్‌గా తీసుకున్న సంస్థ‌ల‌కు ఇది వ‌ర్తిస్తుంది. వ్య‌క్తిగ‌తంగా కానీ, వ్యాపారప‌రంగా కానీ, తీసుకున్న రుణం కోటి రూపాయ‌లు అంతకంటే త‌క్కువ తీసుకున్న కంపెనీల‌కు మాత్ర‌మే ఇది ప‌నిచేస్తుంది.

పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం త‌ర్వాత నుంచి బ్యాంక్‌ల‌లో ర‌ద్దీ అసాధార‌ణంగా పెరిగింది. దీంతో, బ్యాంక్‌లు చేప‌ట్టే సాధార‌ణ కార్య‌క‌లాపాల‌కు కూడా టైమ్ స‌రిపోవ‌డంతో లేదు. దీనికితోడు, వారినికి 24వేల రూపాయ‌లు మాత్ర‌మే డ్రా చెయ్యాల‌నే అనుమ‌తి ఉండ‌డం స‌మ‌స్య‌ను మ‌రింత జ‌టిలం చేసింది. దీంతో, ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఎంతో మేలు చేస్తుంద‌ని ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఒక‌వేళ ఇలా చెల్లించ‌క‌పోయినా రుణ‌గ్ర‌హీత‌ల క్రెడిట్ స్కోర్ మీద ఏమాత్రం ప్ర‌భావం ప‌డబోదని వారు అంటున్నారు.

Loading...

Leave a Reply

*