2 రూపాయ‌ల‌కే నెలంతా ఫ్రీ కాల్స్ అంటున్న బీఎస్ఎన్ఎల్‌

bsnl-1

ఇండియ‌న్ టెలికం రంగంలో రిల‌య‌న్స్ జియో ఎంట్రీ ఓ సంచ‌ల‌నం…. ఓ క‌ల‌క‌లం.. మిగిలిన నెట్‌వ‌ర్కుల్లో క‌ల‌వ‌రం…. ఫ్రీ వాయిస్ కాల్స్‌, ఫ్రీ డేటా అంటూ డేటాగిరితో మార్కెట్‌లో ఫీవ‌ర్ తెప్పించి జ‌య‌హో కొట్టించుకుని జ‌నంలోకి చొచ్చుకుపోయింది జియో…. ఎయిర్‌టెల్‌, ఓడా, ఐడియా లాంటివి ఆఫ‌ర్లు ఇచ్చినా జియోకి పోటీ ఇవ్వ‌లేక‌పోతున్నాయి.. అయితే ఆల‌స్యంగా నిద్ర లేచిన భార‌తీయ టెలికం దిగ్గ‌జం, ప్ర‌భుత్వ రంగ తెల్ల ఏనుగు బీఎస్ఎన్ఎల్ ఇచ్చిన భారీ ఆఫ‌ర్‌తో క‌స్ట‌మ‌ర్ల‌కే కాదు జియోకి కూడా మైండ్ బ్లాంక్ అయింది..

జియో త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు ఓ వ‌ల వేసింది… నెల‌కు 149 రూపాయ‌లు క‌డితే చాలు ఎన్ని కాల్స్ అయినా చేసుకో్వ‌చ్చు… ఎంత‌యినా మాట్లాడుకోవ‌చ్చు….. 149 క‌డితే ఇక నెలంతా ఫ్రీ… మాట్లాడుతూనే ఉండ‌వ‌చ్చు…. అయితే ఇది కేవ‌లం 4జీ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంచింది జియో…. ఇప్పుడు జియో ఇచ్చిన ఆఫ‌ర్‌కి బాబు లాంటి ఆఫ‌ర్‌ని ఇస్తోంది బీఎస్ఎన్ఎల్‌… జ‌స్ట్ 2 రూపాయ‌లు లేదా 4 రూపాయ‌లు క‌డితే చాలు నెలంతా ఫ్రీగా మాట్లాడేసుకోవ‌చ్చు… జియోలా కాకుండా ఈ ఆఫ‌ర్‌ని 4జీతో పాటు 3జీ, 2జీ వినియోగ‌దారుల‌కు కూడా ఇస్తోంది బీఎస్ఎన్ఎల్‌…

ఈ ఆఫ‌ర్‌ను దేశంలో విడ‌త‌ల‌వారీగా ప్ర‌వేశ‌పెట్ట‌నుంది బీఎస్ఎన్ఎల్‌… మొద‌ట త‌మ నెట్‌వ‌ర్క్ బ‌లంగా ఉన్న పంజాబ్‌, యూపీ, ఒడిశా, కేర‌ళ‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్, హ‌ర్యానాల్లో ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది ఈ ప్ర‌భుత్వ టెలికం దిగ్గజం… ఈ ఆఫ‌ర్ కొద్ది నెల‌ల్లో దేశమంతా ఇవ్వడం మొద‌లుపెట్టాక రిలయ‌న్స్ జియోకి దిమ్మ తిరిగి బొమ్మ క‌న‌ప‌డ‌డం ఖాయ‌మంటున్నారు నిపుణులు…. ఒక్క జియోకే కాదు ఎయిర్‌టెల్‌, ఓడా, ఐడియా కూడా కొట్టు క‌ట్టేసే ప‌రిస్థితి వ‌స్తుందంటున్నారు వాళ్లు…. బీఎస్ఎన్ఎల్ భారీ ఆఫ‌ర్‌తో ఖంగు తిన్న జియో దీనికి ఎలా స‌మాధానం ఇస్తుందో చూడాలి.

Loading...

Leave a Reply

*