ఇలా చేస్తే… మీ న‌ల్ల‌ధ‌నం వైట్ అయిపోతుంది

untitled-8

నోట్ల నిషేధంతో లెక్క‌లు చెప్ప‌కుండా కోట్లు కూడ‌బెట్టిన వారిలో వ‌ణుకు మొద‌లైంది. అదే స‌మ‌యంలో ఎంతో కొంత సంపాదించి కొద్ది కొద్దిగా వెన‌కేసుకున్న వారిలోనే ఆందోళ‌న మొద‌లైంది. ఒక్క‌సారిగా నోట్లు చెల్ల‌కుండా పోవ‌డంతో బ్లాక్ బాబులు స‌హా… క‌ష్ట‌ప‌డి కొద్ది మొత్తాల్లో డ‌బ్బు రూపంలో దాచుకున్న వాళ్లు తీవ్రంగా క‌ల‌త చెందుతున్నారు. ఇందులో న‌ల్ల బాబులు అయితే, త‌మ వ‌ద్ద ఉన్న క‌ట్ట‌ల‌ను ఎలా క్యాష్ చేసుకోవాలో ఇప్ప‌టికే ప‌లు ప్లాన్‌లు వేస్తున్నారు. ఎటొచ్చి చిక్కంతా చిన్న చిన్న వ్యాపారాలు చేసి కంపెనీలు పెట్టి కొద్దొగొప్పో కూడ‌బెట్టిన‌వాళ్ల‌కే. ఇప్పుడున్న చ‌ట్టం ప్ర‌కారం వాళ్ల‌కీ కొన్ని అవ‌కాశాలు ఉన్నాయ‌న్న‌ది మాజీ ఐటీ అధికారులు, నిపుణుల మాట‌.

ఆదాయ‌ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 115డీడీఈ కింద త‌మ‌కు ఆ ఆదాయం ఎలా వ‌చ్చిందో చెప్ప‌కుండానే 30.8 శాతం ప‌న్ను చెల్లించి త‌మ ద‌గ్గ‌రున్న క్యాష్‌ను వైట్ చేసుకునే అవ‌కాశం ఉంద‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ సెక్ష‌న్ కింద చూపించిన సొమ్ము సంఘ వ్య‌తిరేక కార్య‌కలాపాల‌కు పాల్ప‌డి ఆర్జించింది కాద‌ని నిరూపించుకోగ‌లిగితే చాల‌ట‌. అయితే, అది కూడా మీరు క‌ట్టిన మొత్తం మీద ఈడీ అధికారుల క‌న్నుప‌డి వారు కేసు పెడితేనే. అయితే, ఇక్క‌డా ఓ చిక్కు ఉంది. ఇటీవ‌ల ప్ర‌భుత్వం ఐడీఎస్ అనే స్కీమ్ పెట్టి 45 శాతం ప‌న్ను క‌ట్టించుకుని న‌ల్ల ధ‌నాన్ని వైట్ చేసుకునే అవ‌కాశం ఇచ్చింది.

ఇప్పుడు ఈ సెక్ష‌న్ 115డీడీఈ కింద 30.8 శాతంతో న‌ల్ల ధ‌నాన్ని మార్చుకునే వెసులుబాటును జ‌నం ఉప‌యోగించుకుంటే గ‌తంలో 45 శాతం ప‌న్ను క‌ట్టిన వాళ్లు కోర్టుకు వెళ్లే చాన్స్ ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక‌, మ‌రో మార్గం ఏమిటంటే ఇప్పుడు క‌ట్టే ప‌న్నుకు వ‌చ్చే ఏడాది ఐటీ రిట‌ర్న్స్‌లో లెక్క‌లు చూపించ‌గ‌లిగితే స‌రిపోతుంద‌ని అప్పుడు లెక్క‌లు చెప్ప‌డంతో విఫ‌ల‌మైతే అప‌రాధ రుసుం కింద 30 జ‌రిమానా చెల్లిస్తే స‌రిపోతుంద‌ని మ‌రో ఐటీ మాజీ అధికారి వెల్లడించారు. అంటే ఇప్పుడు డ‌బ్బు వైట్ చేసుకుని, దానికి వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో లెక్క‌లు చూపి ప‌న్ను చెల్లించాల‌న్న‌మాట‌. ఇక‌, ఇలాంటివే చాలా చిట్కాలు ఇప్పుడు వాట్స‌ప్ స‌హా సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారంలో ఉన్నాయి.

Loading...

Leave a Reply

*