నామాకి బాబు 23వేల కోట్ల ఆఫ‌ర్‌.. !

nama-nageswar-rao

అత్త‌గారి సొమ్ము అల్లుడి దానం అన్న‌ట్టు… ఏపీ జ‌నం సొమ్మును త‌న అస్మ‌దీయుల‌కు అప్ప‌నంగా క‌ట్ట‌బెట్టేస్తున్నారని బాబుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి….. ఇప్ప‌టికే ప‌లు కుంభ‌కోణాల ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న బాబు తాజాగా మ‌రో దోపిడీకి తెర లేపార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తు తున్నాయి.. ఒక‌టి కాదు రెండు ఏకంగా 23 వేల కోట్లు కొల్ల‌గొట్టి త‌న‌వాళ్ల‌కు అప్ప‌గించి క్విడ్ ప్రొ కో ద్వారా వాటిని తాను స్వాహా చేసేందుకు బాబు పావులు క‌దుపుతున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి… జ‌నానికి పంగ‌నామాలు పెట్టేందుకు బాబు సిద్ధ‌మ‌య్యార‌ని చెబుతున్నారు… ఖ‌మ్మం జిల్లాకు చెందిన మాజీ టీడీపీ ఎంపీ, త‌న ఇష్టుడు అయిన నామా నాగేశ్వ‌ర‌రావుకు ఏపీ ప్ర‌జ‌ల సొమ్ము దోచిపెట్టేందుకు బాబు స్కెచ్ గీశారుట‌….

అంత‌ర్జాతీయంగా చ‌మురు, బొగ్గు ధ‌ర‌లు భారీగా ప‌త‌న‌మ‌వ‌డంతో దేశ‌వ్యాప్తంగా అన్ని విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి భారీగా పెరిగింది… ఏపీలో కూడా మిగులు విద్యుత్ భారీగా ఉంది… అయితే చంద్ర‌బాబు క్విడ్ ప్రొ కోలో భాగంగా నామాకు చెందిన రెండు విద్యుత్ సంస్థ‌ల నుంచి 23 వేల కోట్ల రూపాయ‌ల విలువైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నార‌ని తెలుస్తోంది.. ఏటా 600 మెగావాట్ల విద్యుత్‌ను 12 ఏళ్ల‌పాటు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారుట‌… అయితే ఈ ఒప్పందం సంగ‌తి తెలుసుకుని స‌ద‌ర‌న్ ప‌వ‌ర్ డిస్పాచ్‌ సెంట‌ర్ ఖంగు తింది… మిగులు విద్యుత్ ఉన్న స‌మ‌యంలో అంత భారీగా విద్యుత్ కొన‌డం స‌రికాద‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది….

అధికారులు వ‌ద్ద‌ని చెప్పినా బాబు విన‌లేదుట‌..పైగా వారిపై మండిప‌డ్డారుట‌… నామా కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిందే అని ఆదేశించారుట‌.. దీంతో నామా కంపెనీకి వేల కోట్లు దోచిపెట్టే కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది…. అంతేకాదు బ‌హిరంగ మార్కెట్‌లో విద్యుత్ యూనిట్ 2 రూపాయ‌ల‌కే దొరుకుతుంటే నామా కంపెనీ నుంచి 4.43 రూపాయ‌ల‌కు కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించారు…ఒప్పందం ప్ర‌కారం రోజుకు 5.31 కోట్ల విలువైన విద్యుత్‌ను నామా కంపెనీల నుంచి కొంటారు… అంటే ఏడాదికి 1940 కోట్లు, 12 ఏళ్ల‌కు 23,280 కోట్లు నామాకు స‌మ‌ర్పించుకుంటారు.. బాబు దోపిడీ చూసి బెజ‌వాడ వ‌ర్గాలు బెంబేలెత్తిపోతున్నాయిట‌.

Loading...

Leave a Reply

*