యాపిల్ బుట్ట‌లో హైద‌రాబాద్ కంపెనీ

apple

అంత‌ర్జాతీయంగా హైద‌రాబాద్ పేరు మ‌రోసారి మార్మోగింది… ఇప్ప‌టికే ఇండియాకు ఫార్మా హ‌బ్‌గా ఉన్న భాగ్య‌న‌గ‌రం…ఐటీలో మేటి అనిపించుకుంది.. సాఫ్ట్‌వేర్ ఉత్ప‌త్తుల్లో శ‌భాష్ అనిపించుకుంది…. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు పొందింది… తాజాగా ఇండియాలో స్టార్ట‌ప్ కంపెనీల‌కు హైద‌రాబాద్ సెంట‌ర్‌గా మారింది…. అలాంటి ఓ స్టార్ట‌ప్ కంపెనీని ప్ర‌ముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్ప‌త్తుల సంస్థ యాపిల్ సొంతం చేసుకోవ‌డం సంచ‌ల‌న వార్త‌గా మారింది…న‌గ‌రంలోని ట‌పుల్‌జంప్ అనే మెషిన్ లెర్నింగ్ స్టార్ట‌ప్‌ను యాపిల్ కొనుగోలు చేసింది….ఈ కంపెనీ ఇత‌ర కంపెనీల‌కు చెందిన పెద్ద‌మొత్తం డేటాను వారి వ‌ద్ద ఉన్న ప్ర‌త్యేక సాఫ్ట్‌వేర్‌తో స్టోర్‌, ప్రాసెస్‌, విజువ‌లైజ్ చేస్తుంది…. 2013లో ముగ్గురు మిత్రులు క‌లిసి ఈ కంపెనీని స్థాపించారు… వారిలో రోహిత్ రాయ్‌, స‌త్య‌ప్రకాష్ బుద్ధ‌దేవ్ ఇప్ప‌టికే యాపిల్‌లో చేరారు…

మ‌రో స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు దీప‌క్ ఆలూర్ క్లౌడ్ బిజినెస్ కంపెనీ అనాప్లాన్‌లో చేరాడు…. ట‌పుల్‌జంప్‌ను యాపిల్ కొనుగోలు చేసిన‌ట్టు టెక్‌క్రంచ్ పేర్కొంది…. గ‌తంలో కూడా యాపిల్ రెండుమూడు స్టార్ట‌ప్‌ల‌ను సొంతం చేసుకుంది… మంచి ఐడియాలు, క్రియేటివితో స్టార్ట్ అయి బ్ర‌హ్మాండ‌మైన ఫ్యూచ‌ర్ ఉన్న‌ట్టు క‌నిపించిన స్టార్ట‌ప్‌ల‌ను యాపిల్ స్వాహా చేసేస్తుంది…. మొగ్గ ద‌శ‌లోనే వాటిని త‌న సొంతం చేసేసుకుంటుంది… ఇత‌రుల తెలివితేట‌ల‌కు త‌న పెట్టుబ‌డిని జోడించి త‌న భ‌విష్య‌త్తుకు ఢోకా లేకుండా చేసుకుంటుంది… అయితే తాము సాధార‌ణంగా అప్పుడ‌ప్పుడు చిన్న టెక్నాల‌జీ కంపెనీల‌ను కొంటూనే ఉంటామ‌ని, వాటి అవ‌స‌రాలు, ప్ర‌ణాళిక‌ల గురించి వెల్ల‌డించ‌బోమంటోంది యాపిల్‌.. అయితే యాపిల్ సిగ‌లోకి హైద‌రాబాద్ కంపెనీ చేర‌డం తెలుగువాళ్ల‌కు గ‌ర్వ‌కార‌ణ‌మే.

Loading...

Leave a Reply

*