ఏపీ పోలీసుల భారీ ఎన్‌కౌంట‌ర్‌

ap-polices

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-ఒరిస్సా స‌రిహ‌ద్దు ప్రాంతంలోని మ‌ల్కాన్‌గిరి సోమ‌వారం తెల్ల‌వారుజామున కాల్పుల మోత‌తో ద‌ద్ద‌రిల్లింది. ఇటీవ‌ల ఎన్న‌డూ లేన‌ట్లుగా భారీ ఎన్‌కౌంట‌ర్ చోటు చేసుకుంది. అట‌వీ ప్రాంతంలో గాలింపు చేప‌ట్టిన గ్రేహౌండ్స్ పోలీసులు దాదాపు 19 మంది మావోయిస్టుల‌ను చంపేసిన‌ట్లు తెలుస్తోంది. ఏపీ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద ఎన్‌కౌంట‌ర్‌గా ఇది న‌మోదు కానుంది. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టు అగ్ర నేత‌లు కూడా ఉండే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు అధికారులు చెబుతున్నారు. ఆదివారమే అట‌వీ ప్రాంతంలోకొ చొచ్చుకుపోయిన గ్రేహౌండ్స్ బ‌ల‌గాలు అర్ధ‌రాత్రి న‌క్స‌ల్స్ నిర్వ‌హిస్తున్న ఒక స‌మావేశం విరుచుకుప‌డ్డాయి. ఈ ఘ‌న‌ట‌లో ఇద్ద‌రు పోలీసులు కూడా గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. ఏవోబీలో మావోయిస్టుల ప్లీనరీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుతున్న నేపథ్యంలో ఈ భారీ ఎన్‌కౌంటర్ న‌క్స‌ల్ ఉద్య‌మానికి భారీ ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు. కాగా, కాల్పుల్లో అగ్రనేత ఉదయ్ తోపాటు ఆయన దళ సభ్యులు మొత్తం మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టులంతా నిద్ర‌లో ఉన్న స‌మ‌యంలో గ్రేహౌండ్స్ బ‌ల‌గాలు విరుచుకు ప‌డ‌డంతో వారిని ప్ర‌తిఘ‌టించే అవ‌కాశం న‌క్స‌ల్స్‌కు లేకుండా పోయింద‌ని తెలుస్తోంది. ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన ప్రాంతంలో గాలింపు ఇంకా కొన‌సాగుతుంద‌ని ఏపీ డీజీపీ సాంబ‌శివ‌రావు తెలిపారు. ఎంత‌మంది చ‌నిపోయింది… ఎవ‌రెవ‌రు చ‌నిపోయింది ఇప్పుడే చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని ఆ ప్రాంత‌మంతా మందుపాత‌ర‌ల‌తో నిండిపోయి ఉంద‌ని ఈ నేప‌థ్యంలో బ‌ల‌గాలు ముందుకు వెళ్లేందుకు క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Loading...

Leave a Reply

*