బ్యాంక్ డిపాజిట్ ఫామ్‌లో ఇలా రాస్తే.. ట్యాక్స్ ప‌డే చాన్స్ లేద‌ట‌.. ఓ సీనియ‌ర్ అధికారి స‌ల‌హా…!

bank

గ‌త నాలుగయిదు రోజులుగా సోష‌ల్ మీడియాలో ఓ వార్త బాగా షేర్ అవుతోంది. అదేంటంటే.. ఓ ఆదాయ‌ప‌న్ను శాఖ మాజీ అధికారి చేసిన మెస్సేజ్‌. ఇంగ్లీష్‌లో షేర్ అవుతున్న ఆ వార్త‌ను మీకు తెలుగులో అందిస్తున్నాం..గౌత‌మ్ కౌర్ ఓ ఐఆర్ఎస్ అధికారి… చీఫ్ కమిషనర్ గా పనిచేసి రిటైర్ అయ్యాడట‌… ఆయన ప్రస్తుతం నాగపూర్ లో ఉంటున్నాడు… ఎమరాల్డ్ ఫారమ్ అని సొంత సంస్థ పెట్టుకున్నాడు…. అయితే ఆయన పేరిట హల్ చల్ చేస్తున్న మెసేజ్ లో ఆయన ఏం చెప్పాడో చూద్దాం….‘‘‘అధికారంలో ఉన్నది ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వమైనా సరే… ఆదాయపు పన్ను చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే… ఒక్కసారిగా ఏకపక్షంగా పన్ను రేట్లను, జరిమానాలను విధించటానికి అస్సలు వీల్లేదు… కొత్త టారిఫ్ అయినా, కొత్త జరిమానాలు అయినా పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది…

అలాగే మీ దగ్గర ఉన్న డబ్బు డిపాజిట్ చేస్తున్నారంటే, అది తప్పనిసరిగా ఈ ఏడాది ఆదాయమే అని చెప్పాల్సిన అవసరం లేదు, అలా ఎవరూ అనడానికీ వీల్లేదు… మరీ అంత అవసరమైతే అడ్వాన్స్ టాక్సు చెల్లించి, 2017-18 ఆదాయంలోనూ చూపించుకోవచ్చు…. మహా అయితే గరిష్టంగా 33 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది… ఇలా చూపించిన ఆదాయంపై జరిమానా అనేది ఉత్పన్నమే కాదు…’’ అంటున్నాడు ఆయన… రీజనబుల్ గానే ఉన్నట్టుంది ఈ వాదన…అలాగే డిపాజిట్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకొండి అని కూడా చెబుతున్నాడు… 30 శాతం పన్ను, దానిపై 200 శాతం జరిమానా అంటూ రకరకాల ప్రచారాలు డిపాజిట్లకు అడ్డం పడుతున్న నేపథ్యంలో ఇవి కాస్త ఆసక్తికరంగానే వినిపిస్తున్నాయి…. ఇవీ చదవండి.,..

1) 2.50 లక్షల వరకు డిపాజిట్ చేస్తుంటే, అదీ కొత్త ఖాతాలో అయితే… ఇలా రాయండి….
“Earnings in cash for FY 2016-17 deposited due to demonitization”

2) పిల్లల ఖాతాలో గనుక దాన్ని డిపాజిట్ చేస్తున్నట్టయితే… ఇలా రాయండి….
“Cash gifts received during growing up years deposited due to demonitization”

3) మహిళల ఖాతాలో గనుక డిపాజిట్ చేస్తున్నట్టయితే… ఇలా రాయండి…. (పాన్ కార్డు ఫోటో కాపీ జతచేసి…)
“Savings from House Hold Expenses over the years deposited due to demonitization”
ఇవన్నీ పన్ను విధించే డిపాజిట్లు కావు…

(WhatsApp message)

మ‌రి, ఇది నిజ‌మో అబ‌ద్ద‌మో అకౌంటెంట్‌లకే తెలియాలి. అప్ప‌టిదాకా ఇది షేరింగ్‌కే ఉప‌యోగ‌ప‌డుతుందా? అనేది హాట్ టాపిక్‌.

Loading...

Leave a Reply

*