అజిత్‌ని పిలిపించుకున్న అమ్మ‌…రేపోమాపో అపోలోకి?

amma

పుర‌చ్చి త‌లైవి… పేద‌ల పాలిట పెన్నిధి… విప్ల‌వ నాయ‌కి…. త‌మిళ‌నాడు సీఎం అమ్మ జ‌య‌లలిత అనారోగ్యంతో ఆస్ప‌త్రి పాలైంది.. అమ్మ కోలుకుని ఆస్ప‌త్రి నుంచి రావ‌డానికి మ‌రికొన్నాళ్లు ప‌ట్టే అవ‌కాశం ఉంది.. అమ్మ ప‌డకెయ్య‌డంతో త‌మిళ‌నాడులో పాల‌న కూడా ప‌డ‌కే సింది…ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌య‌ల‌లిత వార‌సుడిపై చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి… ఎవ‌రికి వాళ్లు తామే జ‌య వార‌సుల‌మ‌ని ప్ర‌క‌టించుకుంటు న్నారు… అయితే జ‌నం వాళ్ల‌ను యాక్సెప్ట్ చేయ‌డం లేదు… రేపు జ‌య‌ల‌లిత కోలుకున్నాక అలాంటివాళ్ల‌ను చీపురుక‌ట్ట ప‌ట్టుకుని త‌రిమెయ్య‌డం గ్యారంటీ… ఇప్పుడు అమ్మ వారసుడు ఎవ‌రు అనే విష‌యం త‌మిళ‌నాడును కుదిపేస్తోంది..

త‌మిళ తంబీలు ఉత్కంఠ‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు… అమ్మ త‌ర్వాత పార్టీని ముందుకు న‌డిపించే నాయ‌కుడు కావాలి… ఆ నాయకుడికి ప్ర‌జాద‌ర‌ణ ఉండాలి…. డీఎంకేతో ఢీ కొట్టే స‌త్తా ఉండాలి… ఇలాంటివాడు ఎవ‌రు ఉన్నారా అని అన్నాడీఎంకే వ‌ర్గాలు దుర్భిణీ వేసి గాలిస్తున్నాయి… అయితే జ‌య‌ల‌లిత చాలా తెలివిగ‌లది… ఎప్పుడో ముందుచూపుతో త‌న వార‌సుడిని ఎంపిక చేసింద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి…. త‌న వారసుడి గురించి జ‌య సీక్రెట్‌ వీలునామాలో కూడా ప్ర‌స్తావించార‌ని స‌మాచారం. అమ్మ త‌న వీలునామాను త‌న‌కు అత్యంత విధేయులైన వారి ద‌గ్గ‌ర ఉంచార‌ని స‌మాచారం.

త‌గిన స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు వాళ్లు దాన్ని బ‌య‌టపెడ‌తారు… ఆ వీలునామాలో త‌మిళ్ బడా హీరో అజిత్ పేరు ఉందని త‌మిళ మీడియా కోడై కూస్తోంది.. ఇప్పుడిప్పుడే ఆస్ప‌త్రిలో కొద్దికొద్దిగా కోలుకుంటున్న జ‌య‌ల‌లిత కూడా అజిత్‌ని పిలిపించుకున్నార‌ని, వ‌చ్చి త‌న‌ను క‌ల‌వ‌మ‌న్నార‌ని స‌మాచారం…. రేపోమాపో అపోలో ఆస్ప‌త్రికి అజిత్ వెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది.. అయితే ఇప్ప‌టికిప్పుడు అజిత్‌కి పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌క పోయినా అన‌ధికారికంగా కొన్ని బాధ్య‌త‌లు జ‌య అప్ప‌గించ‌నున్నార‌ని చెబుతున్నారు.

Loading...

Leave a Reply

*