జ‌గ‌న్‌కు త‌లుపులు మూసేసిన బీజేపీ!

amit-png1

కేంద్ర మంత్రి వెంక‌య్య ప‌దేప‌దే చెప్పే మాట ఒక‌టే. చంద్ర‌బాబును బీజేపీ నుంచి బ‌య‌ట‌కు రమ్మంటున్న వాళ్లంతా తాము ఎన్డీయేలోకి రావాల‌నుకుంటున్న‌వాళ్లేన‌ని ఆయ‌నెప్పుడూ చెబుతుంటారు. బాబు బ‌య‌ట‌కొస్తే… మీరు లోప‌లికి వ‌ద్దామ‌నా అని ప్ర‌తి స‌భ‌లోనూ మీడియా స‌మావేశంలోనూ వెంక‌య్య ప్ర‌శ్నిస్తుంటారు. అంటే బీజేపీ నేతృత్వం వ‌హిస్తున్న ఎన్డీయేలోంచి చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వ‌స్తే జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ ఆ కూట‌మిలోకి వెళ్ల‌డానికేన‌న్న‌ది దాని ఉద్దేశం. అయితే, ఈ విష‌యంలో ఏపీ బీజేపీ నేత‌ల‌కు అమిత్ షా పూర్తి క్లారిటీ ఇచ్చేశార‌ట‌.

చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఫిర్యాదులు చేసేందుకు వెళ్లిన బీజేపీ నేత‌ల‌కు అమిత్ భారీ క్లాసే తీసుకున్నార‌ట‌. చంద్ర‌బాబు వైదొల‌గినా…. వైసీపీ వ‌స్తాన‌న్నా, జ‌గ‌న్ వ‌చ్చి చేర‌తాన‌న్నా అంగీక‌రించే ప్ర‌శ్నే లేద‌ని అమిత్ షా తేల్చి చెప్పార‌ట‌. 2019లో ఎన్నిక‌ల‌కు టీడీపీ-బీజేపీ క‌లిసే ప‌ని చేస్తాయ‌ని ఇందులో ఎవ‌రికీ సందేహం అక్క‌ర్లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశార‌ట‌. ఇక చంద్ర‌బాబు ఏదైనా తీవ్ర నిర్ణ‌యం తీసుకుని వైదొల‌గితే త‌ప్పించి తాము మాత్రం చంద్ర‌బాబును దూరం చేసుకునే ఉద్దేశ‌మే లేద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టార‌ట‌.

జాతీయ‌స్థాయిలో చంద్ర‌బాబు మంచి ప‌ర‌ప‌తి ఉన్న నాయ‌కుడ‌ని, ఆయ‌న అవ‌స‌రం ఎన్డీయేకి ఎంతో ఉంద‌ని కూడా అమిత్ షా బీజేపీ నేత‌ల‌కు క్లారిటీ ఇచ్చార‌ట‌. దాంతో బాబుపై ఫిర్యాదులు చేసి ఆయ‌న‌ను బ‌య‌ట‌కు పంపేయాల‌ని ఢిల్లీ వెళ్లిన నేత‌లు సైలెంట్‌గా ఏపీకి తిరిగొచ్చార‌ని స‌మాచారం. అధిష్టానం మ‌న‌సులో ఏముందో స్ప‌ష్టం కావ‌డంతో ఇక ఇప్పుడు ఆయా నేత‌లంతా చంద్ర‌బాబు వీరుడు, శూరుడూ అంటూ ఆకాశానికెత్తే ప‌ని చేప‌ట్టార‌ని తెలిసింది.

Loading...

Leave a Reply

*