5 నిముషాల్లో 6700 కోట్లు, గంట‌లో 33వేల కోట్ల‌ సంపాద‌న‌…!

untitled-11

ఆలీబాబా డాట్‌కామ్‌. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌లాంటి ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్‌. చైనాలో దీనిదే హ‌వా అంతా. దీపావ‌ళికి మ‌న ఇండియాలో చాలా ఈ కామ‌ర్స్ సైట్‌లు బిగ్ డీల్స్‌ని ప్ర‌క‌టించాయి. కొంద‌రు పండ‌గ ఆఫర్ అన్నారు. మ‌రికొంద‌రు బిగ్ డే ఆఫ‌ర్ అని, మ‌రికొన్ని వెబ్ సైట్‌లు వేరే పేరుతో ఆఫ‌ర్‌ల‌ని అనౌన్స్ చేశాయి. వినియోగ‌దారుల‌ని ఆక‌ర్షించి భారీగా క్యాష్ చేసుకున్నాయి.చైనాలోనూ స‌రిగ్గా ఇలాంటి రోజే ఒక‌టి ఉంటుంది. దానిని క్యాష్ చేసుకునేందుకు ఆలీబాబా.కామ్ బంపర్ ఆఫ‌ర్‌ల‌తో ముందుకు వ‌చ్చింది.

ఊహించ‌ని రేంజ్‌లో ప్ర‌మోష‌న్‌లు, గిఫ్ట్‌లు, భారీ డీల్స్‌, ఆఫ‌ర్‌లు ప్ర‌క‌టించ‌డంతో జ‌నాలు ఎగ‌బ‌డ్డారు. ఎంత‌లా అంటే 5 నిముషాల్లో 6700 కోట్ల రూపాయ‌ల‌కు వ‌స్తువులు కొనుగోలు చేశారు. ఇక‌, గంటలో ఏకంగా 33వేల కోట్ల‌రూపాయ‌ల మేర బిజినెస జ‌రిగింది. అంటే, వినియోగ‌దారులు ఏ రేంజ్‌లో ఆలీబాబా వెంట ప‌డ్డారో ఊహించ‌వ‌చ్చు. ఈ అమ్మ‌కాల‌లో అధిక‌వాటా మొబైల్స్ రంగానిదే.

ఈ స్థాయిలో ఒక్క‌రోజులో ఎక్క‌డా వ్యాపార లావాదేవీలు జ‌ర‌గ‌లేదట‌. ప్ర‌పంచంలోనే ఇది ఓ రికార్డ్ అంటున్నారు. 2009 నుంచి ప్ర‌తి ఏటా ఒక రోజున ఈ ఆఫర్‌ని ప్ర‌క‌టిస్తుంది ఆలీబాబా.కామ్‌. మిగిలిన రోజుల కంటే ఆ రోజున భారీగా ఆఫ‌ర్‌లు ఇస్తుంది. అందుకే, ఇలా ఎగ‌బ‌డుతున్నార‌ట‌. ఇదే ఊపున మ‌రో రెండు మూడేళ్ల‌లో అది ఒక్క రోజు సేల్స్‌లో 50వేల కోట్ల‌కు రీచ్ అయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌న్న‌మాట‌.

Loading...

Leave a Reply

*