ఎయిర్‌టెల్ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌..!

untitled-3-1

తెలికాం రంగంలో ఒక సరికొత్త రికార్డ్ ను సృష్టించడానికి తాజాగా రిలయన్స్ సంస్థ నుంచి ‘జియో’ మార్కెలోకి వదిలారు. ఇక వినియోగ దారులు కూడా బాగానే పెరగడంతో, దానికి పోటీగా ఎయిర్ టెల్ సంస్థ భారీ ఆఫర్స్ తో యూజర్స్ ను ఆకట్టుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. అందులో భాగంగానే  ఏ నెట్‌వర్క్‌కు అయినా 28 రోజుల పాటు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ 28 రోజుల వ్యవధిలో 18జీబి వరకు 3జీ/4జీ మొబైల్ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చట.

  • ఇక ప్రస్తుతం కాల్ డ్రాప్ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో జియో కాల్ టైమింగ్‌ను 30 నిమిషాలకు తగ్గించిన విషయం తెలిసిందే. కాల్ కనెక్ట్ అయి 30 నిమిషాలు పూర్తికాగానే ఆటోమెటిక్‌ గా డిస్కనెక్ట్ కాబడుతుంది.
  • దీంతో ఎయిర్‌ టెల్‌ అందించే ఈ ఆఫర్‌లో ఈ విధమైన సమస్య ఉండదట. కాల్స్ కూడా ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. 2,249 పెట్టి రీఛార్జ్ చేయించటం ద్వారా ఈ ఆఫర్‌ను ఎయిర్‌ టెల్ యూజర్లు పొందవచ్చు.
  • ఇంతకీ ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే.. 28 రోజుల వ్యాలిడిటీతో వర్తించే ఈ ఆఫర్‌లో భాగంగా ఎయిర్‌ టెల్ నెంబర్లతో పాటు వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్, ఆర్‌కామ్, ఎయిర్‌సెల్, డొకోమో వంటి నెట్‌వర్క్‌లకు ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చు.
  • ఇక ఈ ఆఫర్ ను పొందడానికి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారా..అక్కడకే వస్తున్నా..ముందుగా మీ ఎయిర్‌ టెల్ నెంబర్ నుంచి #121*1#కు డయల్ చేయండి. ఆఫర్ మీ నెంబర్‌కు అందుబాటులో ఉందో లేదో తెలిసిపోతుంది.
  • లేక మై ఎయిర్ టెల్ యాప్‌ ను మీ ఫోన్‌ లోకి డౌన్‌ లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయండి. యాప్ ద్వారా మీ ఎయిర్‌ టెల్ అకౌంట్‌లోకి లాగిన్ అయిన తరువాత స్పెషల్ ఆఫర్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • ఆ తరువాత అక్కడ కనిపించే స్పెషల్ ఆఫర్స్ లో భాగంగా 2,249 రీఛార్జ్ ఆఫర్ పై క్లిక్ చేయండి. పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ కార్డ్ వివరాలను ఎంటర్ చేసిన పే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • ఒక వేళా ఆ ఆఫర్ మీరు అర్హులైతే, మీ నంబర్ కు ఈ ఆఫర్ యాక్టివేట్ అవ్వడానికి దాదాపు 4 గంటల వరకు పట్టొచ్చు.
  • ఈ ఆఫర్ ఎంపిక చేసిన ఎయిర్‌ టెల్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. కేవలం 3జీ/4జీ నెట్‌వర్క్‌లకు మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.

పరిస్థితి చూస్తుంటే..జియోకి చెక్ పెట్టడానికి ఎయిర్ టెల్ ఇలాంటి ఆఫర్ ను రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ పోటీలో ఎవరికి ఎక్కువగా యూజర్స్ పెరుగుతారో చూడాలి.

 

Loading...

Leave a Reply

*