ఎయిర్ టెల్ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌. రూ.49కే అన్నీ ఫ్రీ ఫ్రీ…!

untitled-111

జియో ఎంట్రీతో దేశ టెలికాం ముఖ‌చిత్రం మారిపోతోంది. డేటాగిరి మొద‌ల‌యింది. నిన్న‌మొన్న‌టిదాకా క‌స్ట‌మ‌ర్లు కంపెనీల బాదుడుతో విసిగిపోయారు. ఏ టెలికాం కంపెనీ పోర్ట్ కొడ‌దామ‌న్నా బిల్లు వాచిపోతుందేమోన‌న్న భ‌యం వెంటాడుతుండేది. ఇప్పుడు సీన్ మారింది. నిన్న‌మొన్న‌టిదాకా టారిఫ్ ప్లాన్‌ల విష‌యంలో త‌న‌కంటూ ఓన్ ప‌ద్ధ‌తిని అనుస‌రించిన ఎయిర్‌టెల్ కూడా తాజాగా దిగి వ‌స్తోంది. ఇప్పటిదాకా డేటా ప్లాన్‌ల‌ను స‌వ‌రించి క‌స్ట‌మ‌ర్ల‌ను నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేసిన ఎయిర్‌టెల్ తాజాగా దానిని కాల్స్‌కి కూడా విస్త‌రించింది. రూ. 49కే అన్‌లిమిటెడ్ కాల్స్ అంటూ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. సూప‌ర్ సేవ‌ర్ ప్యాక్‌గా అభివ‌ర్ణిస్తూ.. లోక‌ల్ మ‌రియు నేష‌న‌ల్ కాల్స్ కేవ‌లం 49కే పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది.. దాని వివ‌రాలు ఇలా ఉన్నాయి..

స్పెష‌ల్ సూప‌ర్ ప్యాక్‌లో భాగంగా ఎయిర్‌టెల్ వినియోగ‌దారులు రెండు ర‌కాల ప్లాన్‌లు పొంద‌వ‌చ్చు. రూ.49కి అన్‌లిమిటెడ్ లోక‌ల్ కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు. రూ.99కి అన్‌లిమిటెడ్ లోక‌ల్ మరియు నేష‌న‌ల్ కాల్స్ చేసుకోవ‌చ్చు. మీరు ఈ ఆఫ‌ర్‌ని పొందేందుకు ఎయిర్‌టెల్ కంపెనీ వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి.. అక్క‌డ డీట‌యిల్స్ అన్నీ ఉన్నాయి. అక్క‌డ మీరు ఎయిర్‌టెల్ బ్రాండ్‌బ్యాండ్, ల్యాండ్ లైన్ యూజ‌ర్ ద‌గ్గ‌ర క్లిక్ చెయ్యండి.. అక్క‌డ మీకు బై నో ఆప్ష‌న్ ఉంటుంది. అక్క‌డ క్లిక్ చేసి మీ వివ‌రాల‌న్నీ అందులో ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. మీ ల్యాండ్ లైన్ ఎస్‌టీడీ కోడ్‌ని కూడా ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత మీకు ఏ ప్లాన్ కావాలో ఎంచుకొని దానిని క్లిక్ చేస్తే చాలు.. దీనిని ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా పొంద‌వ‌చ్చు. వివ‌రాలు కంపెనీ వెబ్‌సైట్‌లో క్లియ‌ర్‌గా ఉన్నాయి.

Loading...

Leave a Reply

*