ఎయిర్‌టెల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. 2 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌…!

airtel

ఎయిర్‌టెల్ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. జియో ఎంట్రీతో డేటాగిరి మొద‌ల‌యింది. దీంతో, ఎంతో మంది క‌స్ట‌మ‌ర్లు రిల‌య‌న్స్ జియోకు ఓటేస్తున్నారు. జియో ఫ్రీ ఆఫ‌ర్‌కి జై కొట్టేశారు. దీంతో, ఇత‌ర టెలికాం కంపెనీల‌న్నీ ఆఫ‌ర్‌ల బాట ప‌డుతున్నాయి. ఒక‌దానితో ఒకటి పోటీప‌డి మ‌రీ ఆఫ‌ర్‌లు ఇచ్చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఎన్నో ఫ్రీ డేటా ప్యాక్‌ల‌ను ప్ర‌క‌టించిన ఎయిర్‌టెల్‌.. త‌న వినియోగ దారుల కోసం మ‌రో కొత్త ప్యాకేజ్ తీసుకువ‌చ్చింది. 2 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌ని అందివ్వాల‌ని భావిస్తోంది.మీ డేటా, వీడియో, మ్యూజిక్ ఫైల్స్‌ను స్టోర్ చేసుకోవ‌డం, ఎప్ప‌టికప్పుడు అప్‌డేట్ కావ‌డం మీకు క‌ష్టంగా ఉందా..? అందుకే, ఈ డేటా స్టోరేజ్ ప్యాక్‌ని మీరు పొంద‌వ‌చ్చు. ఈ ప్యాక్‌ని మీరు ఉచితంగా పొందాలంటే.. ఎయిర్‌టెల్ యాప్‌నుంచి ఉచితంగా పొంద‌వ‌చ్చు.

ఈ స్టోరేజ్‌లో మీరు ఫోటోలు, వీడియోలు, ఆడియో, కాల్స్ వివ‌రాల‌ను స్టోర్ చేసుకోవ‌చ్చు. అయితే, ఇది కేవ‌లం ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే. ఐఓఎస్ కస్ట‌మ‌ర్ల‌కు ఇది ప‌నిచెయ్య‌ద‌ట‌.ఈ ఆఫ‌ర్ కోసం ఎయిర్‌టెల్ వినియోగ‌దారులు ఎయిర్‌టెల్ లేటెస్ట్ వెర్ష‌న్‌..(వి 4.1.3) గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. డౌన్ లోడ్ చేసుకున్న త‌ర్వాత అక్క‌డ పాప్ అప్ నోటిఫికేష‌న్ వ‌స్తుంది. అక్క‌డ ఎయిర్‌టెల్ బ్యాక‌ప్ ఆప్ష‌న్ వ‌స్తుంది. ఇది లేటెస్ట్ అప్‌డేట్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ల‌భిస్తుంది.క్లౌడ్ ఓపెన్ చెయ్య‌గానే అక్క‌డ నోటిఫికేష‌న్‌లు ఉంటాయి. అక్క‌డ మీకు కావాల్సినవి స్టోర్ చేసుకోవ‌చ్చు.

అక్క‌డ మీ ఫైల్స్‌ని స్టోర్ చేసుకోవ‌చ్చు. లేదంటే.. ఈ యాప్ మీ ఫైల్స్‌ను ప్ర‌తి రోజు ఉద‌యం 1 గంట నుంచి 5 గంట‌ల మ‌ధ్య‌లో మీ ఫైల్స్‌ని ఆటోమేటిక్‌గా స్టోర్ చేసుకుంటుంది. ఈ టైమ్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అది మార‌దు. అయితే, ఈ బ్యాక‌ప్‌లో కేవ‌లం మీ కాంటాక్ట్స్‌తో పాటు ఇత‌ర‌ ఫైల్స్‌ని భ‌ద్ర‌ప‌ర‌చుకోవ‌డం మంచిది. వీడియోస్‌తోపాటు ఇత‌ర మ్యూజిక్ ఫైల్స్‌కి ఇది స‌రిపోదు. ఈ ఆఫ‌ర్‌ని ఇప్ప‌టికే గూగుల్‌తో పాటు ఆపిల్ కూడా అందిస్తోంది. అయితే, ఎయిర్‌టెల్ మ‌రిన్ని ఫీచ‌ర్స్‌ని అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని చెబుతోంది. మ‌రి, మ‌రెందుకాల‌స్యం.. మీరు కూడా ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌ని పొంది క్లౌడ్ స్టోరేజ్‌ని ఎంజాయ్ చెయ్యండి.

Loading...

Leave a Reply

*