అనుభ‌విద్దాం ర‌మ్మ‌ని ఆ అమ్మాయి చేసిన ప‌నేంటి?

anubhavisthunna

తియ్య‌టి మాట‌ల‌తో చాటింగ్‌. ఆగ‌లేక కోరిక‌ను వెల్ల‌డించి అబ్బాయిలు. అయితే ఇంకా ఆల‌స్య‌మెందుకు ర‌మ్మ‌ని ఆహ్వానం వ‌ల విసిరిన కాలేజీ గాళ్‌. దొరికింది గోల్డెన్ చాన్స‌నుకుంటూ ఆ అమ్మాయి ఇంటి ముందు వాలిన ఆ యువ‌కుల‌కు గుండె గుభిల్లుమంది. తేనెలూరే మాట‌ల‌తో వంచించి చివ‌రకు నిలువు దోపిడీ చేసిన ఆ యువ‌తిపై ఇప్పుడా యువ‌కులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో జ‌రిగిన ఈ ఉదంతం మీరూ చ‌ద‌వండి. అత్యాచారాలు, అబ‌ల‌ల‌పై వేధింపుల విష‌యంలో అగ్ర‌స్థానంలో ఉన్న హ‌స్తిన‌లో ఒక అమ్మాయి ఇద్ద‌రు యువ‌కుల‌ను మోసం చేసిన క‌థ‌నం ఇది. ఒక డేటింగ్ యాప్‌లో ఓ కాలేజీ అమ్మాయితో ఇద్ద‌రు యువ‌కుల‌కు మాట‌లు కలిశాయి.

చాటింగ్ చాలా దూరం వెళ్లింది. చివ‌ర‌కూ ఇద్ద‌రు యువ‌కులూ ఆ అమ్మాయితో త‌మ మ‌నసులోని కోరిక చెప్పేశారు. దానికి ఆ ప‌డతి కూడా స‌రేనంది. అయితే, అందుకు కొంత ధ‌ర చెల్లించాల‌ని చెప్పింది. చివ‌ర‌కు ఏడు వేల రూపాయ‌ల‌కు బేరం కుదిరింది. అమ్మాయితో గ‌డ‌పాల‌న్న కోరిక‌తే డ‌బ్బు ప‌ట్టుకుని ఆమె చెప్పిన అడ్ర‌స్ ముందు వాలిపోయారా యువ‌కులు. ఢిల్లీలోని ఉత్త‌మ్‌న‌గ‌ర్‌కు చేరుకున్న యువ‌కుల‌ను ముందుగా మాట్లాడుకున్న ప్రకారం యువ‌తి స్నేహితుడు రిసీవ్ చేసుకున్నాడు. ఆన‌క అంద‌రూ క‌లిసి కిర‌ణ్‌గార్డెన్‌లోని యువ‌తి ఇంటికి వెళ్లారు.

అక్క‌డ అంద‌రూ త‌ప్ప‌తాగారు. అప్పుడు ఆ యువ‌తిలోని అస‌లు రూపం బ‌య‌ట‌కొచ్చింది. చెప్పిన‌ట్లు విని జేబులో సొమ్ములు ఇచ్చి వెళ్లాల‌ని బెదిరించింది. ఇవ్వ‌కుంటే నాపై దాడి చేశారంటూ కేసు పెడ‌తాన‌ని హెచ్చ‌రించింది. యువ‌తి హెచ్చ‌రిక‌ల‌తో భ‌య‌ప‌డిన‌ ఆ యువ‌కులిద్ద‌రూ త‌మ వ‌ద్ద ఉన్న 11 వేల రూపాయ‌లు ఆ యువ‌తికి స‌మ‌ర్పించుకుని బ‌తుకు జీవుడా అంటూ బ‌య‌ట‌ప‌డ్డారు. తాము మోస‌పోయిన విష‌యాన్ని ఆ త‌ర్వాత యువ‌కులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఆ యువ‌తిని, ఆమెకు స‌హ‌క‌రించిన వ్య‌క్తిని అరెస్టు చేశారు.

Loading...

Leave a Reply

*