9/11 ఆమెరికాలో ఇదో సంచ‌ల‌నం!

trump1

9/11 అమెరికాకు సంబంధించిన వ‌ర‌కూ ఇదో చ‌రిత్రాత్మ‌క‌మైన సంఖ్యే. ప‌దిహేనేళ్ల క్రితం అమెరికాలో ఇదే సంఖ్య‌తో ఉన్న రోజున ఉగ్ర‌వాదులు త‌మ పంజా విసిరారు. ఇప్పుడు ఇదే సంఖ్య‌తో ఉన్న రోజున సంచ‌ల‌నాత్మ‌కంగా ట్రంప్ విజ‌యం సాధిస్తున్నారు. అదేమిటో ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌రమైన విష‌యాలు క‌నిపిస్తాయి. 2001లో తాము సుర‌క్షితంగా ఉన్నామ‌ని భావిస్తున్న అమెరిక‌న్ల‌పైకి ఉగ్ర‌వాదులు పంజా విసిరారు.

సేమ్ 9/11(సెప్టెంబ‌ర్ తొమ్మిదో తేదీ)న అమెరికాలోని ట్విన్ ట‌వ‌ర్స్‌ను పేల్చేశారు. దాంతో ఒక్క‌సారిగా అమెరికా వ‌ణికిపోయింది. ఆ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కూ అమెరిక‌న్ల‌లో ఉగ్ర‌వాదుల భ‌యం వెన్నాడుతూనే ఉంది. ఇప్పుడు అమెరికా ఎన్నిక‌ల‌లో దూకుడుగా ముందుకొచ్చిన రిప‌బ్లిక‌న్‌ల అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌నాత్మ‌క విజ‌యం సాధించారు. ఈ రోజు సేమ్ 9/11(న‌వంబ‌ర్ తొమ్మిదిన‌) వెల‌వ‌డుతున్న ఫ‌లితాలు అంద‌రి అంచ‌నాల‌ను తారు మారు చేశాయి.

అంద‌రూ హిల్ల‌రీదే విజ‌యం ఘంటా ప‌దంగా చెబుతున్న త‌రుణంలో అందుకు భిన్నంగా ట్రంప్ విజ‌యం సాధించారు. ఈ రెండు సంఘ‌ట‌న‌ల‌కు సంబంధించి తేదీలు ఒక‌టే అయినా.. నెల‌లు మాత్ర‌మే వేరు. అయితే అంకేల ప‌రంగా సేమ్ టూ సేమ్ 9/11. ప‌దిహేనేళ్ల త‌ర్వాత కూడా ఈ అంకేకు అమెరికాలో ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంద‌ని తేలింది.

Loading...

Leave a Reply

*