ఒక్క‌రోజులో కాగ్నిజెంట్‌కి 30వేల కోట్లు న‌ష్టం..!

cognizant

అంత‌ర్జాతీయ ఐటీ దిగ్గ‌జం కాగ్నిజెంట్ టెక్నాల‌జీస్‌పై మ‌దుప‌రులు పెట్టుకున్న ఆశ‌ల సౌధం కూలిపోయింది. ఆ సంస్థ‌పై వ‌స్తున్న అవినీతి ఆరోప‌ణ‌ల‌తో మార్కెట్‌లో దాని విలువ మ‌స‌క‌బారిపోతుంది. వెర‌సి కోట్లాది మంది తీవ్రంగా న‌ష్ట‌పోయే ప‌రిస్థితి నెల‌కొంది. రూపాయి రూపాయి కూడ‌బెట్టుకుని చేసిన ఇన్వెస్ట్‌మెంట్లు క‌ళ్ల‌ముందే క‌రిగిపోయాయి కాగ్నిజెంట్ షేర్ మార్కెట్ తీవ్రంగా దెబ్బ‌తిన‌డంతో దాదాపు 30 వేల కోట్ల రూపాయ‌ల మదుప‌రుల సొమ్ము ఆవిరైన‌ట్లు స‌మాచారం. ఇదంతా గ‌త వారంలో జ‌రిగిన న‌ష్టం కావ‌డం గ‌మ‌నార్హం.

2012లో ఈ సంస్థ చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్‌గా ఉన్న గోర్టాన్ కొబుర్న్ రాజీనామా చేశారు. అగ్నికి ఆజ్యం పోసిన‌ట్లు ఇప్పుడున్న అధ్య‌క్షుడిపై కూడా అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతో సంస్థ షేర్ రోజు రోజుకు దిగ‌జారిపోతుంది. ఈ ఏడాది సంస్థ వ్యాపారం తీవ్రంగా దెబ్బ‌తిన‌డంతో కాగ్నిజెంట్ రెండుసార్లు త‌న ఆదాయ అంచ‌నాల‌ను త‌గ్గించుకుంది. ఈ క్ర‌మంలోనే కాగ్నిజెంట్‌కు ఇవ్వాల్సిన ఈక్విటీని త‌గ్గించి బ‌య‌ట‌ప‌డాల‌ని బ్రోక‌రేజీ సంస్థ‌లు సూచిస్తున్నాయి.

Loading...

Leave a Reply

*