షాకింగ్‌.. మీ ఏటీఎమ్‌ పిన్ నెంబ‌ర్ మార్చుకోండి.. 32ల‌క్ష‌ల డెబిట్ కార్డ్‌ల స‌మాచారం లీక్‌….?

untitled-19-1

నిన్న‌టికి నిన్న ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ల ఇన్‌ఫ‌ర్మేష‌న్‌ను కొంద‌రు కావాల‌ని ట్యాపింగ్ చేశారనే మేట‌ర్ దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. అది మ‌రిచిపోక‌ముందే.. మ‌రో షాకింగ్ వార్త వెలుగులోకి వ‌చ్చింది. దేశంలో దాదాపు 30ల‌క్ష‌ల మంది ఖాతాదారుల డెబిట్ కార్డ్ డీట‌యిల్స్‌ను త‌స్క‌రించార‌నే స‌మాచారం కొంద‌రు అక్ర‌మార్కుల చేతుల‌లోకి వెళ్లిపోయింద‌ట‌. దీనిని భారీ ఉల్లంఘ‌న‌గా మార్కెట్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఈ 32 ల‌క్ష‌ల కార్డ్‌ల‌లో సుమారు 26ల‌క్ష‌ల కార్డులు వీసా, మాస్ట‌ర్ కార్డుల‌వి అని స‌మాచారం. ఈ వ్య‌వ‌హారాన్ని గుర్తించ‌డానికి సుమారు ఆరు వారాలు ప‌ట్టింద‌ట‌. హిటాచీ నెట్ వ‌ర్క్‌లో ఉప‌యోగించిన సుమారు 32 మిలియ‌న్ కార్డ్‌ల స‌మాచారం హ్యాక‌ర్‌లు సేక‌రించార‌ని అధికారులు భావిస్తున్నారు.

ముఖ్యంగా వివిధ ఏటీఎమ్ సెంట‌ర్‌లు, షాపింగ్ మాల్స్‌లో చేసిన ట్రాన్సాక్ష‌న్స్ ఆధారంగా ఆ డెబిట్‌కార్డ్‌ల స‌మాచారాన్ని హ్యాక్ చేశార‌ట‌. ఇప్ప‌టికే కొంత న‌గదు డ్రా చెయ్య‌డంతో ఉలిక్కిప‌డ్డ బాధితులు ఫిర్యాదు చేశార‌ట‌. దీనిపై విచారణకు ఆదేశించినట్టు నేషనల్ పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ)ఎండీ ఏపీ హోతా తెలిపారు. బ్యాంకులనుంచి తమకు ఫిర్యాదులు అందాయనీ, ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎక్కడ జరిగింది అనేది విచారణ విచారిస్తున్నామని తెలిపారు.లేట్‌గా లేటెస్ట్‌గా బ్యాంక్ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. బ్యాంకులు, డెబిట్ కార్డుల సమాచారం భారీ ఎత్తున లీక్ అయిందనే అంచనాలతో దాదాపు అన్ని బ్యాంకులు ఏటీఎం పిన్ నంబర్ ను మార్చుకోవాలని సూచిస్తున్నాయి. పిన్ లేకుండా జరిగే అంతర్జాతీయ లావాదేవీలనన్నింటినీ నిలిపివేశాయి.

ఇప్పటికే ఆరున్నర లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరందరికీ కొత్త కార్డులను ఇవ్వనున్నట్టు తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగానే సుమారు 6 లక్షలకు పైగా కార్డులను బ్లాక్ చేశామని తమ ఏటీఎంలో ఎలాంటి అక్రమాలు జరగడంలేదని ఖాతాదారులకు భరోసా ఇచ్చినట్టు బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో సుమారు రెండు వారాల క్రితమే చర్యలు తీసుకున్నామని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ తెలిపింది. పిన్ లు మార్చుకోమని సలహా ఇవ్వడంతోపాటు, ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడొద్దని కోరినట్టు బ్యాంక్ ప్రతినిధి వెల్లడించారు. వీసా, మాస్టర్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్, ఎస్ బ్యాంకులనుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

Loading...

Leave a Reply

*