29వేల ఫోన్‌.. స్నాప్‌డీల్‌లో రూ.68కే..!

snap

68 రూపాయ‌ల‌కే ఐ ఫోన్ 5 ఎస్‌.. ఇది అబ‌ద్ధం కాదు.. అక్ష‌రాలా నిజం.. ఈ ఆఫ‌ర్ ఇచ్చింది ఎవ‌రో కాదు.. స్నాప్ డీల్‌.. అయితే, ఇది లిమిటెడ్ ఆఫ‌ర్ అట‌. ఎలా వ‌చ్చిందో, ఎందుకు వ‌చ్చిందో కూడా స్నాప్‌డీల్‌కి తెలియ‌ద‌ట‌. అయితే, ఈ ఆఫ‌ర్‌ని ఓ వ్య‌క్తి ద‌క్కించుకున్నాడు. తీరా స్నాప్ డీల్ సంస్థ అది తూఛ్ అంది. దీంతో స‌ద‌రు వ్య‌క్తి కోర్టు మెట్లెక్క‌డంతో 29వేల రూపాయ‌ల కాస్ట్‌లీ ఫోన్‌ని.. చివ‌రికి 68కే ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. దీని వెనుక అస‌లు స్టోరీ ఏంటంటే…పంజాబ్ యూనివర్సిటీకి చెందిన నిఖిల్ బన్సల్ బీటెక్ స్టూడెంట్. ఆ యువకుడు ఈ ఏడాది ఫిబ్రవరి 12న స్నాప్‌డీల్‌లో ఐఫోన్ 5ఎస్ బుక్ చేశాడు.

దీని ధ‌ర 28999 రూపాయ‌లు. అయితే, త‌న‌కు 99.7 శాతం డిస్కౌంట్ వ‌చ్చి ఆ ఫోన్ 68కే వ‌చ్చినట్లు స్నాప్ డీల్ నుంచి మెస్సేజ్ వ‌చ్చిన‌ట్లు వివ‌రించాడు నిఖిల్ బ‌న్స‌ల్. కానీ, స్నాప్‌డీల్ త‌న‌కు ఆ త‌ర్వాత ఫోన్ పంప‌లేద‌ని, త‌న ద‌గ్గ‌రున్న ఎస్ఎమ్ఎస్ ఆధారంగా వినియోగదారుల ఫోర‌మ్‌ని ఆశ్ర‌యించాడు. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో ఈ ఫిర్యాదు చేశాడు నిఖిల్ బ‌న్స‌ల్‌. అయితే, క‌న్సూమ‌ర్ ఫోర‌మ్‌లో స్నాప్‌డీల్ తాము అంత త‌క్కువ‌కి ఎలాంటి ఆఫ‌ర్ ఇవ్వ‌లేద‌ని వాదించింద‌ట‌.

అన్ని సాక్ష్యాలు ప‌రిశీలించిన కోర్ట్‌.. నిఖిల్ బ‌న్స‌ల్‌కే సానుకూలంగా తీర్పు ఇచ్చింద‌ట‌. ఎస్ఎమ్ఎస్ నిజం క‌నుక‌.. 68 రూపాయ‌ల‌కు ఫోన్ ఇవ్వాల‌ని లేదంటే భారీగా పెనాల్టీ వేస్తామ‌ని తెలిపింది కోర్టు. అంతేకాదు, అత‌ని కోర్టు ఖ‌ర్చుల‌కింది ప‌దివేల రూపాయ‌లు కూడా చెల్లించాల‌ని ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి న‌డుస్తున్న ఈ కేసు తాజాగా ముగిసింది. మొత్త‌మ్మీద‌, 68కే ఐ ఫోన్ 5ఎస్‌ని సొంతం చేసుకున్నాడు నిఖిల్ బ‌న్స‌ల్‌. భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్‌ల పేరుతో ఎక్కడో జరిగిన చిన్న మిస్టేక్‌.. నిఖిల్‌కి బాగా క‌లిసొచ్చింది. డెడ్ చీప్‌గా ఫోన్‌కొట్టేశాడు. అలాంటి ల‌క్ మీకు ఉందేమో ట్రై చెయ్యండి.

Loading...

Leave a Reply

*