బాహుబ‌లి 2లో ఈ యువ హీరోకి బిగ్ రోల్‌… పిలిచి ఇచ్చిన రాజ‌మౌళి….!

untitled-35

బాహుబ‌లిలో న‌టించే చాన్స్ ఎంద‌రినో వ‌రించింది. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌, సోన‌మ్ క‌పూర్ వంటి వారిని ముందుగా ఆయా పాత్ర‌ల కోసం సంప్ర‌దించాడు జ‌క్క‌న్న. వారు ఆ బంపర్ ఆఫ‌ర్‌ని మిస్ చేసుకున్నారు. ఆ త‌ర్వాత తెలిసింది అది ఎలాంటి పాత్రో. ఇప్పుడు ఆ సినిమా ఎందుకు మిస్ అయ్యామా.. అని త‌ల పట్టుకుంటున్నారు వాళ్లు.

అయితే, బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్‌లో యువ న‌టుడు సిద్దార్ధ్ నాయుడు క‌నిపించ‌నున్నాడు. ఈ అప్‌క‌మింగ్ హీరోకి పిలిచి మ‌రీ చాన్స్ ఇచ్చాడు రాజ‌మౌళి. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అనామిక చిత్రంలో చిన్న పాత్ర పోషించిన సిద్ధార్ద్ , పూరీ తెరకెక్కిస్తోన్న రోగ్ లో నెగెటివ్ పాత్ర పోషిస్తున్నాడు సిద్దార్ధ్‌. అనామిక‌లో ఆయ‌న న‌ట‌న, బాడీలాంగ్వేజ్ చూసి థ్రిల్ అయిన రాజ‌మౌళి.. సిద్దార్ధ్‌ని పిలిచి ఈ చాన్స్‌ను ఇచ్చాడ‌ట‌. అంతే, జ‌క్క‌న్న నుంచి పిలుపు వ‌చ్చిందో లేదో.. ఆయ‌న ఖుషీ ఖుషీగా వెంట‌నే ఓకే అన్నాడ‌ట‌.

ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ బాహుబలి 2లో ఈ యువ నటుడిని క్రూషియల్ పాత్రకు సెలక్ట్ చేయడంతో సిద్ధార్ద్ చాలా ఆనందంగా ఫీలవుతున్నాడు. వచ్చిన మంచి అవకాశాన్ని ఈ నటుడు సద్వినియోగం చేసుకోగా, ఇటీవల ప్రభాస్, రానా, తదితర నటులతో కలిసి వచ్చే సీన్స్ ని తెరకెక్కించారట. బాహుబలి 2 చిత్రం డిసెంబర్ తో షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకోనుండగా జనవరి నుండి సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకోనుంది. ఏప్రిల్ 28, 2017న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Loading...

Leave a Reply

*