స‌మంత లెగ్ పెట్టింది.. చైతు పంట పండింది..!

sam1

గొడ్డు వ‌చ్చిన వేళ‌… బిడ్డ వచ్చిన వేళ అనేది పాత సామెత‌. శుభానికి, అశుభానికి వాడే సామెత ఇది. అలాగే.. ల‌వర్ వ‌చ్చిన వేళ‌.. అంటూ పాట పాడుకుంటున్నాడు నాగ‌చైత‌న్య‌. గ‌త కొంత‌కాలంగా చైతు-సమంత మ‌ధ్య హాట్ హాట్‌గా ప్రేమాయ‌ణం సాగుతోంది. అది పెళ్లి దాకా వ‌చ్చింది. ఈ ఇద్ద‌రి మ్యారేజ్ వార్త క‌న్‌ఫ‌మ్ అయిన త‌ర్వాత నాగ‌చైత‌న్య నుంచి వ‌స్తున్న తొలి చిత్రం ప్రేమ‌మ్. ఈ సినిమాపై ఇప్పుడు అంద‌రి ఫోక‌స్ ప‌డింది. మ‌ల‌యాళంలో తెరకెక్కిన ప్రేమ‌మ్‌కి ఇది రీమేక్‌.స‌మంత లెగ్ మ‌హిమో మ‌రేదో కానీ.. ఆయ‌న లేటెస్ట్ మూవీ ప్రేమ‌మ్ ట్ర‌యిల‌ర్‌కి యూ ట్యూబ్‌లో భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా థియేట‌ర్ ట్ర‌యిల‌ర్ ఏకంగా 2 మిలియ‌న్ వ్యూస్ ద‌క్కించుకుంది. అంటే 20 ల‌క్ష‌ల హిట్స్ అన్న‌మాట‌. కేవ‌లం 4 రోజుల్లోనే ఈ ఫీట్ సాధించింది.

రీసెంట్‌గా మ‌మేష్‌, ప‌వ‌న్‌, ఎన్టీఆర్‌, బ‌న్ని వంటి బ‌డా హీరోల సినిమాలు మిన‌హా.. మీడియం రేంజ్ హీరోల సినిమాల‌కు ఈ స్థాయిలో వ్యూస్ ద‌క్క‌డం లేదు. కానీ, నాగ‌చైత‌న్య ప్రేమ‌మ్ కూడా అగ్ర క‌థానాయ‌కులతోపాటు వ్యూస్‌ను పొంద‌డం విశేషం.స‌మంత‌కి ఇండ‌స్ట్రీలో గోల్డెన్ లెగ్ అనే పేరుంది. త‌మిళ్‌లో ఆమెకు స‌క్సెస్ ప‌ర్సంటేజ్ త‌క్కువే అయినా.. తెలుగులో మాత్రం ఆమె డెలివ‌ర్ చేసిన ఫ్లాప్‌ల‌ను వేళ్ల‌తో లెక్క‌పెట్టొచ్చు. సుమారు ఇక్క‌డ న‌టించిన పాతిక చిత్రాల‌లో ఫ్లాప్‌లు మూడు నాలుగుకు మించి ఉండ‌వు. అన్నీ ఇండ‌స్ట్రీ హిట్ చిత్రాలే. దూకుడు, ఈగ‌, అత్తారింటికి దారేది, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, జ‌న‌తా గ్యారేజ్‌, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, బృందావ‌నం..

ఇలా టాలీవుడ్ టాప్‌లో ఆమెవే దాదాపు ఏడెనిమిది ఉండ‌డం ఖాయం.ఇదే గోల్డెన్ లెగ్‌.. నాగ‌చైత‌న్య లైఫ్‌లోనూ కొత్త మార్పులు తీసుకు వచ్చిందంటున్నారు సినీ జనాలు. ప్రేమ‌మ్ సినిమాపై అంచ‌నాలు పెర‌గ‌డంలో స‌మంత పార్ట్‌కూడా ఉందంటున్నారు. ఆమె ఫ్యాన్స్ కూడా సినిమాపై స్పెష‌ల్ ఇంట‌రెస్ట్ చూపిస్తున్నార‌ట‌. అంతేకాదు, ఓ బ‌డా హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవడంతో కొంద‌రు చైతుపై ప్ర‌త్యేక‌మైన అభిమానాన్ని పెంచుకున్నార‌ట‌. ఇలా, ప్ర‌తి అంశ‌మూ క‌లిసి వ‌స్తోంద‌ట చైతుకి చుల్‌బులీ ఎంట్రీతో. అదే నిజ‌మయితే.. స‌మంత ల‌క్ చైతుకి కూడా వ‌స్తుంద‌న్న‌మాట‌..!

Loading...

Leave a Reply

*