ధోని సినిమా ప్ర‌మోష‌న్‌కి చెర్రీ ఎందుకు డుమ్మా కొట్టాడు..?

cherry

టీమిండియా క్రికెట్ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ జీవితగాథ ఆధారంగా తెర‌కెక్కిన మూవీ ఎమ్.ఎస్‌. ధోనీ.. ది అన్ టోల్డ్ స్టోరీ. హిందీలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు, త‌మిళ్‌తోపాటు ప‌లు భాష‌ల‌లో విడుద‌ల అవుతోంది. ఈ మూవీలో సురేష్ రైనా పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టించాడ‌నే టాక్ వినిపిస్తోంది. గ‌తంలోనే రూమ‌ర్ వ‌చ్చినా.. ఆ త‌ర్వాత అది స‌ద్దుమ‌ణిగింది. రీసెంట్‌గా సినిమా ప్ర‌మోష‌న్ కోసం స్వ‌యంగా ధోని హైద‌రాబాద్ వచ్చాడు. రాజ‌మౌళి ముఖ్య అతిథిగా ఈ ఈవెంట్ జ‌రిగింది.ఈ ఆడియో రిలీజ్ వేదిక‌పై రాజ‌మౌళి ధోనిని ఆకాశానికి ఎత్తేశాడు. ఈ చిత్రంలో చెర్రీ న‌టించినా.. ఈవెంట్‌కి ఎందుకు రాలేద‌నే టాక్ న‌డుస్తోంది. సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌ది తక్కువ లెంగ్త్ ఉన్న పాత్రే కావొచ్చు.

కానీ అది బాలీవుడ్ చిత్రం. అందులోనూ నేష‌న‌ల్ వైడ్ రిలీజ్ అవుతోన్న మూవీ. అంతేకాదు, ధోని సినిమాకి తెలుగులో పాపులారిటీ కావాలి. రాజ‌మౌళి ఆడియో ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు. అది ఓకే. అదే చెర్రీ లాంటి బ‌డా హీరో ఆడియోకి వ‌చ్చి ఉంటే.. అది డిఫ‌రెంట్‌గా ఉండేదే. మెగా ఫ్యాన్స్‌లో అది క్రేజ్‌గా ఉండేది. త‌మ హీరో బాలీవుడ్‌లో న‌టించాడు అని ఓపెనింగ్స్ పెరిగేవి. ఇటు, మెగా టీమ్ కూడా త‌మ సినిమా అని ఓన్ చేసుకొని ప్రమోట్ చేసేదే. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. అలాంటి బంపర్ చాన్స్‌ ధోని సినిమా యూనిట్ ఎందుకు మిస్ అయింది..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

కొంద‌రు మాత్రం చెర్రీ న‌టించ‌లేదు అని చెబుతుంటే.. మ‌రికొంద‌రు సినిమా విడుద‌ల త‌ర్వాత చెర్రీ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవ‌డానికే ఇలా చేశారు అని చెబుతున్నారు. మ‌రోవైపు, ఇంకొంద‌రు విప‌రీత అర్ధాలు తీస్తూ.. రాజ‌మౌళి వస్తే.. నేను రాన‌ని చెర్రీ చెప్పాడ‌నే మాట కూడా వినిపిస్తున్నారు. వీట‌న్నింటికంటే డిఫ‌రెంట్ స్టోరీ వినిపిస్తున్నారు కొంత‌మంది. స‌చిన్ బ‌యోగ్ర‌ఫీ కూడా త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. ప్రెజెంట్ చిరు, నాగ్‌, స‌చిన్ బిజినెస్ పార్ట‌న‌ర్స్‌. అందుకే, ధోని సినిమాకి ప్ర‌మోష‌న్ చెయ్య‌లేద‌నే కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఏది నిజ‌మ‌నేది మ‌రో రెండు రోజుల్లో తేల‌నుంది.

Loading...

Leave a Reply

*