తార‌క్‌, బ‌న్ని, చ‌ర‌ణ్‌లో కాజ‌ల్ న‌చ్చిన‌ డ్యాన‌ర్స్ ఎవ‌రు…?

kajal

కాజ‌ల్‌.. తొలిసారిగా సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్‌తో నేరుగా ఇంట‌రాక్ట్ అయింది. ఆస్క్ కాజ‌ల్ అంటూ ఆమె ట్విట్ట‌ర్‌లో క్వ‌శ్చ‌న్ అవ‌ర్ పెట్టింది. అభిమానుల‌ను ప‌ల‌క‌రించింది. వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఎంతో ఓర్పుగా స‌మాధాన‌మిచ్చింది. కాజ‌ల్‌కి సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ క్రేజ్ ఉంది. దీంతో, ఆమెతో ఒక్క‌సారి అయినా హాయ్ చెప్పించుకోవాల‌ని ఎంద‌రో అభిమానులు ఆస‌క్తి క‌న‌ప‌రిచారు.

బంతిపూల జాన‌కిని అభిమానులు ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఎన్నో క‌ఠిన‌మైన ప్ర‌శ్న‌లు వేశారు. కొంద‌రు ఆమెను ఇరికించే ప‌ని కూడా చేశారు. కానీ ఆమె తెలివిగా స‌మాధాన‌మిచ్చారు. ఇలాంటి ప్ర‌శ్నే ఓ తెలుగు అభిమాని వేశారు. తెలుగు చిత్ర‌సీమ‌లో మీకు న‌చ్చిన బెస్ట్ డ్యాన్స‌ర్ ఎవ‌రు? అని అడ‌గ్గా..ఆమె ఎక్క‌డా దొర‌క‌కుండా, ఏ హీరో ఫ్యాన్స్‌ని గాయ‌ప‌ర‌చ‌కుండా స‌మాధాన‌మిచ్చారు. తార‌క్‌, బ‌న్ని, చ‌ర‌ణ్‌.. ఈ ముగ్గురూ టాలీవుడ్‌లో బెస్ట్ డ్యాన్స‌ర్స్ అని అభిప్రాయ‌ప‌డింది.

తెలుగులో మీకు న‌చ్చిన డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..? ఠ‌క్కున రాజ‌మౌళి అని స‌మాధాన‌మిచ్చింది కాజ‌ల్‌. గ‌తంలో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో మ‌గ‌ధీర చిత్రంలో న‌టించింది. ఇక‌, మీ ఆల్‌టైమ్ ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ అని అడిగితే.. ఒక‌టికి మూడు సార్లు ద‌ర్శ‌క దిగ్గ‌జం, ది లెజెండ్ మ‌ణిర‌త్నం పేరు ప్ర‌స్తావించింది. మొత్తానికి కాజ‌ల్ ఎక్క‌డా వివాదాస్ప‌దం కాకుండా మాట్లాడి అంద‌రి హీరోల ఫ్యాన్స్‌ను మెప్పించింది.

Loading...

Leave a Reply

*