దేవి పక్కన ఈ ముద్దుగుమ్మ ఎవరు…

dsp

కేవలం మ్యూజిక్ తో, హిట్ ఆల్బమ్స్ తోనే కాదు… గాసిప్స్ తో కూడా పాపులర్ అవుతుంటాడు దేవిశ్రీప్రసాద్. ఆమధ్య ఓ హీరోయిన్ తో ఎఫైర్ అంటూ చాలానే ప్రచారం నడిచింది దేవిశ్రీప్రసాద్ పై. హీరోయిన్లతో చాలా క్లోజ్ గా ఉండే ఈ కంపోజర్ కు ఇలాంటి గాసిప్స్ కొత్తేం కాదు. త్రిష, చార్మి, శ్రద్ధాదాస్.. ఇలా చాలామందికి కనెక్ట్ చేస్తూ దేవీపై పుకార్లు వచ్చినా అవేమీ నిజం కాలేదు. తాజాగా ఐమ్యాక్స్ లో జరిగిన దేవి ప్రీమియం షోకు… కన్నడ ఇండస్ట్రీ నుంచి ప్రత్యేకంగా ఓ అమ్మాయిని పిలిపించుకున్నాడు దేవి.

ఆ అమ్మాయితో కూడా లింక్ పెడుతూ అప్పట్లో చాలా వార్తలొచ్చాయి. తాజాగా ఇప్పుడు మరో అమ్మాయితే దేవిశ్రీ దిగిన ఫొటో హల్ చల్ చేసింది. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరా అని అంతా ఆరాలు తీశారు. కట్ చేస్తే… ఆమె ఓ సింగర్ అని తేలింది. జాస్మిన్ అనే ఈ సింగర్ ను తెలుగుతెరకు పరిచయం చేస్తున్నాడు దేవి. అది కూడా చిరంజీవి నటిస్తున్న ఖైదీ నంబర్ 150తో తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతోంది జాస్మిన్. ఆ సాంగ్ రికార్డింగ్ టైంలోనే జాస్మిన్ తో ఇలా ఫొటో దిగాడు మన దేవి.

Loading...

Leave a Reply

*