అఖిల్ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా…

akhil

కొన్నిరోజులుగా చప్పుడు చేయడం లేదు అఖిల్. సోషల్ మీడియాలో కూడా ఇన్-యాక్టివ్ గా ఉంటున్నాడు. మరి అఖిల్ ఏం చేస్తున్నట్టు.. అసలు ఇండియాలోనే ఉన్నాడా… హైదరాబాద్ లో ఉంటే కనిపించడేం.. కొత్తకొత్త ఫొటోలు కూడా పెట్టడం లేదు… పార్టీలు-ఫంక్షన్లకు కూడా రావడం మానేశాడు.. దీంతో అంతా అఖిల్ కోసం ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

తాజా సమాచారం ప్రకారం.. అఖిల్ హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉంటున్నాడు. ఎలాంటి పార్టీలు, ఫంక్షన్లు పెట్టుకోవడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా తన రెండో సినిమా గురించే ఆలోచిస్తున్నాడు. అవును.. అఖిల్ ఇప్పుడు తన రెండో సినిమా మేకోవర్ పనిలో పడ్డాడు. మరోవైపు దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా హనీమూన్ ముగించుకొని వచ్చేయడంతో ఇద్దరూ స్టోరీ డిస్కషన్ పనిలో ఉన్నారు.

తన రెండో సినిమాకు సంబంధించి ఇప్పటికే కథను ఫైనలైజ్ చేశాడు అఖిల్. ప్రస్తుతం దర్శకుడు-హీరో కలిసి స్క్రీన్ ప్లే వర్కవుట్ చేస్తున్నారు. పక్కా స్క్రీన్ ప్లే రెడీ అయిన తర్వాత సినిమా ఓపెనింగ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తారు. ఈ స్క్రీన్ ప్లే ఓ కొలిక్కి వచ్చినంతవరకు ఎలాంటి పర్సనల్ పనులు పెట్టుకోకూడదని ఫిక్స్ అయిపోయాడట అఖిల్.

Loading...

Leave a Reply

*