చుట్టూ ఈ బ్యాచ్ ఏంటి మహేష్…

maheshbabu

మహేష్ ప్రస్తుతం స్టార్ డైరక్టర్లతో వర్క్ చేస్తున్నాడు. త్వరలోనే కొరటాల శివతో కూడా కలిసి పనిచేయబోతున్నాడు. అతడి సినిమాల లైనప్ కూడా బ్రహ్మాండంగా ఉంది. అయినప్పటికీ… ఓ ఎలిమెంట్ మాత్రం ఘట్టమనేని ఫ్యాన్స్ ను భయపెడుతూనే ఉంది. ఎంతమంది హిట్ దర్శకులతో పనిచేస్తున్నప్పటికీ…మహేష్ చుట్టూ తిరుగుతున్న బ్యాచ్ మాత్రం అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రిన్స్ ఎక్కడ వాళ్లకు మరో ఛాన్స్ ఇస్తాడేమోనని ఫ్యాన్స్ బెంబేలెత్తిపోతున్నారు.

మెహర్ రమేష్ ఇప్పుడు మహేష్ కు చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. అతడితో సినిమా అంటే అందరికీ అనుమానాలే. ఇది చాలాదన్నట్టు ఈమధ్య శ్రీనువైట్ల, ప్రత్యేకంగా మహేష్ ను కలిశాడనే పుకారు ఒకటి. ఓ కథ కూడా వినిపించాడనే షాకింగ్ న్యూస్. ఇప్పటికీ అభిమానుల్ని ఆగడు మూవీ వెంటాడుతూనే ఉంది. ఇలాంటి టైమ్ లో ఈ వార్త రావడం అందర్నీ కలవరపెడుతోంది. పైగా తాజాగా మహేష్ బాబుకు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల కూడా ప్రిన్స్ తో సమావేశం అయ్యాడట.

బ్రహ్మోత్సవం దెబ్బ అభిమానులకు మామూలుగా తగల్లేదు. ఈ సినిమా ఎఫెక్ట్ కి, మిగతా హీరోల ఫ్యాన్స్ ముందు తలెత్తుకోవడానికి కూడా చాలా ఇబ్బందిపడ్డారు మహేష్ ఫ్యాన్స్. అలాంటి దర్శకుడు మళ్లీ మహేష్ ను కలిశాడని తెలిసిన వెంటనే ఫ్యాన్స్ కు మండిపోయింది. అయితే ప్రస్తుతానికి ఈ బ్యాచ్ లో ఎవర్నీ మహేష్ ఎంటర్ టైన్ చేయడం లేదు. ప్రస్తుతం మురగదాస్ సినిమా చేస్తున్న ప్రిన్స్.. ఆ తర్వాత కొరటాలకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా ఇంకో హిట్ దర్శకుడికే అవకాశం ఇస్తాడట.

Loading...

Leave a Reply

*