ఐష్ కు ఏమైంది…

untitled-29

తనలో ఇంకా గ్లామర్ తగ్గలేదని నిరూపించుకోవాలనుకుంటుందా… లేక అభిషేక్ బచ్చన్ పై కోపంతో ఇలా ప్రవర్తిస్తోందా.. లేక తోటి హీరోయిన్ల నుంచి వస్తున్న ఒత్తిడి వల్ల ఇలా బరితెగిస్తోందా… కారణం ఏదైనా ఐశ్వర్యరాయ్ మాత్రం వెండితెరపై రెచ్చిపోతోంది. కో-స్టార్ రణబీర్ కపూర్ పెదవుల్ని పిండేస్తోంది. వరుసగా లిప్ కిస్సులు ఇచ్చేస్తోంది. పెళ్లయి, ఓ కూతురు కూడా ఉందనే స్పృహ లేకుండా తెగ స్కిన్ షో చేస్తోంది. ఇది బిగ్ బి కుటుంబానికి కొత్త చిక్కులు తెస్తోంది.

నిజానికి ఐష్ ప్లేస్ లో మరో హీరోయిన్ ఈ రేంజ్ లో రెచ్చిపోయినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఆమె బిగ్ బి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. బాలీవుడ్ లో గౌరవప్రదమైన కుటుంబాల్లో అదే మొదటిది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఐశ్వర్య ఇలా రెచ్చిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కారణం ఏమై ఉంటుందా అని అంతా ఆరాలు తీసేలోగానే… రోజుకో కొత్త స్టిల్, కొత్త వీడియోతో ఏ దిల్ హై ముష్కిల్ సినిమా యూనిట్ హల్ చల్ చేస్తోంది.

నిజానికి తన సినిమాల్లో తనే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా ఉంటాడు రణబీర్ కపూర్. ప్లే బాయ్ గా, క్యాసినోవాగా పేరున్న ఈ కుర్రహీరో సినిమాకు పెద్ద ఎస్సెట్. అలాంటి రణబీర్ కపూర్ ను కూడా ప్రేక్షకులు మరిచిపోయేలా ఐశ్వర్యరాయ్ రెచ్చిపోతోంది. ఆమె ఎందుకు ఇదంతా చేస్తోందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే బిగ్ బి కుటుంబం నుంచి త్వరలోనే అతిపెద్ద షాకింగ్ వార్త వినాల్సి వస్తుందని మాత్రం చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Loading...

Leave a Reply

*