రాజ‌మౌళి కూతురికి ఆ హీరో ఇచ్చిన స‌ల‌హా ఏంటి?

raja-mouli

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి…. ఇప్పుడు ఆయ‌న టాలీవుడ్‌లో మాత్ర‌మే కాదు ఇండియాలోనే టాప్ డైరెక్ట‌ర్‌… పెద్ద‌పెద్ద టెక్నీషియ‌న్లు, బ‌డా డైరెక్ట‌ర్లు, పెద్ద పెద్ద హీరోలు ఆయ‌న‌కు విన‌యంగా వంగి న‌మ‌స్కారం పెడ‌తారు… రాజ‌మౌళి టాప్ డైరెక్ట‌ర్ మాత్ర‌మే కాదు మ‌రో ర‌కంగా చెప్పాలంటే ఆయ‌న ఇండియాలోనే బ‌డా హీరో…. హీరోల‌కే హీరో… అలాంటి రాజమౌళిని ఎంద‌రో పెద్ద‌వాళ్లు స‌ల‌హాలు అడుగుతారు…. రాజ‌మౌళిని అంద‌రు స‌ల‌హాలు అడుగుతుంటే ఆయ‌న కూతురు మాత్రం ఏం చేసిందో తెలుసా… ఓ బాలీవుడ్ యంగ్‌ హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్లింది… ఓ విష‌యంలో అత‌డి స‌ల‌హా అడిగింది…. అంతే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అంతా షాక‌య్యారు… రాజ‌మౌళి కూతురు వెళ్లి స‌ల‌హా అడ‌గ‌డం ఏంటా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు… అసలేం జ‌రిగిందంటే…ఇటీవ‌ల బాహుబ‌లి2 ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ కోసం రాజ‌మౌళి అండ్ టీమ్ ముంబై వెళ్లింది…

బాహుబ‌లి టీమ్‌తో పాటు రాజ‌మౌళి ఫ్యామిలీ కూడా వెళ్లింది…ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి కూతురు వెళ్లి బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాను క‌లిసింది…. ఆ పిల్ల వెళ్లి సిద్ధార్థ్ మ‌ల్హోత్రాను ఎందుకు క‌లిసిందో ఎవ‌రికి అర్థం కాలేదు… అస‌లేం జ‌రిగిందా అని జ‌నం జుట్టు పీక్కుంటున్నారు… ఇంత‌లో రాజ‌మౌళి ట్విట్ట‌ర్‌లో ఓ బాంబు పేల్చాడు… నా కుమార్తెను క‌లిసినందుకు చాలా థ్యాంక్స్ సిద్ధార్థ్ మ‌ల్హోత్రా… ఆమె సూప‌ర్ సూప‌ర్ ఎగ్జైట్ అయింది… ఆమెకు స‌ల‌హా ఇచ్చినందుకు ఇంకా థ్యాంక్స్‌.. మా జీవితాన్ని సుల‌భ‌త‌రం చేశారు అంటూ రాజ‌మౌళి ట్వీట్ చేశారు..రాజ‌మౌళి ట్వీట్‌కు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా రిప్ల‌య్ ఇస్తూ… హ‌లో సార్‌…నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని..

థ్యాంక్స్ చెప్పాల్సిన అవ‌స‌రం లేదు… ఆమె చాలా చ‌క్క‌గా మాట్లాడింది… ఈసారి వ‌చ్చిన‌ప్పుడు మిమ్మ‌ల్ని చూస్తాన‌ని ఆశిస్తున్నాను అని సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు….సిద్ధార్థ్ మ‌ల్హోత్రాను రాజ‌మౌళి కూతురు ఏం స‌ల‌హా అడిగింది… దానికి ఆయ‌న ఏం చెప్పాడు… దానివ‌ల్ల రాజ‌మౌళి కుటుంబజీవితం సుల‌భ‌త‌రం ఎందుకు అయింది… ఈ విష‌యాలు ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు.. ఇవీ భేతాళ ప్ర‌శ్న‌ల్లా మిగిలిపోయాయి… బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడో తెలుస్తుందేమో కానీ ఈ విష‌యం మాత్రం తెలిసేట‌ట్టు లేదు అని అభిమానులు నిట్టూరుస్తున్నారు.

Loading...

Leave a Reply

*