వినాయక్ కు అవకాశం రావడానికి కారణం అదేనా…

vinayak

ప్రస్తుతం చిరంజీవితో ఖైదీ నంబర్-150 సినిమా చేస్తున్నాడు వినాయక్. ఎంతోమంది దర్శకుల పేర్లు పరిశీలించిన తర్వాత ఫైనల్ గా వీవీ వినాయక్ ను ఆ ఛాన్స్ వరించింది. నిజానికి అప్పటికే అఖిల్ సినిమాతో అట్టర్ ఫ్లాప్ తెచ్చుకొని ఉన్నాడు వినాయక్. అయినప్పటికీ… వినాయక్ ను పిలిచి మరీ 150వ సినిమా అప్పగించాడు చిరంజీవి. దీంతో అప్పట్లో అంతా షాక్ అయ్యారు. ఎట్టకేలకు ఆ వ్యవహారంపై వినాయక్ స్పందించాడు. తనకు ఎలా ఛాన్స్ వచ్చిందో వివరించాడు.నిన్నంతా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు వినాయక్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వినాయక్.. చిరంజీవి తనకు చాలా క్లోజ్ అని చెప్పుకొచ్చాడు.

కెరీర్ స్టార్టింగ్ నుంచి చిరంజీవి తనపై చాలా నమ్మకం ఉంచారని, కేవలం ఒక్క సినిమా ఫ్లాప్ తో తనను ఎప్పుడూ లెక్కించలేదని చెప్పుకొచ్చారు. బన్నీతో బద్రీనాధ్, బన్నీ లాంటి సినిమాలు చేసినా… రామ్ చరణ్ తో నాయక్ సినిమా చేసినా అవన్నీ చిరంజీవి కనుసన్నల్లోనే జరిగాయని గుర్తుచేశారు.తన సినిమాలు హిట్ అయినా, ఫెయిల్ అయినా వ్యక్తిగతంగై తనపై చిరంజీవికి అపార నమ్మకం ఉందని.. ఆ నమ్మకంతోనే అఖిల్ లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత కూడా తనను పిలిచి ప్రతిష్టాత్మక 150వ సినిమాను అప్పగించారని… ఆ విషయంలో మెగాస్టార్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు వినాయక్.

Loading...

Leave a Reply

*