డాడీ మ‌హేష్‌బాబుతో నా పెళ్లి చేస్తావా.. విల‌న్ కూతురు కోరిక‌..!

untitled-15

సంప‌త్ రాజ్ గుర్తున్నాడా..? ఆయ‌న తెలియ‌క‌పోవ‌డం ఏంటి అంటారా..? మిర్చి, ర‌న్ రాజా ర‌న్‌, శ్రీమంతుడు వంటి చిత్రాల‌తో తెలుగులో పాపుల‌ర్ అయ్యాడు. న‌ట‌న ప‌రంగా, బాడీ లాంగ్వేజ్ ఫ‌రంగా కూగా త‌క్కువ టైమ్‌లోనే బాగా రెయిజ్ అయ్యాడు. టాలీవుడ్ టాప్ విల‌న్‌ల‌లో ఒక‌రిగా ఎదిగాడు.ఇదంతా అటుంచితే.. ఆయ‌న‌కు ప‌ద‌హారేళ్ల కూతురు ఉంద‌ట‌. సింగ‌పూర్‌లో ఉండే ఆ అమ్మాయి గ‌తేడాది శ్రీమంతుడు సినిమా చూసింద‌ట‌. వెంట‌నే మ‌హేష్ బాబు ఫ్యాన్‌గా మారిపోయింద‌ట‌. సినిమాలో ఆమె తండ్రే విల‌న్ క‌దా.. సినిమా చూసి వ‌చ్చిన త‌ర్వాత ఆమె త‌న తండ్రి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి.. డాడీ నాకు మ‌హేష్‌బాబుని ఇచ్చి పెళ్లి చేస్తావా?

అని అడిగింద‌ట‌. కూతురు ప్ర‌శ్న‌కు, కోరిక‌కు సంప‌త్ రాజ్ తెగ న‌వ్వేశాడ‌ట‌.ఆ త‌ర్వాత సినిమాలో మ‌హేష్‌ని క‌త్తితో పొడిచిన సీన్‌ని గుర్తుకు తెచ్చి.. మ‌హేష్‌బాబుని కొడ‌తావా నువ్వు..? యూ ఆర్ వెరీ బ్యాడ్ ఫాద‌ర్ అని అంద‌ట‌. ఈ మాట‌ల‌కు సంప‌త్‌రాజ్ తెగ ఖుషీ అయిపోయాడ‌ట‌. త‌న కూతురి ప్ర‌శ్న‌లు త‌న‌కు బాగా న‌వ్వు తెప్పించాయ‌ని, ఇటీవ‌ల ఓ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్‌వ్యూలో ఆయ‌న చెప్పి మురిసిపోయాడు. అంతేకాదు, మ‌హేష్‌కి లేడీస్ మంచి ఫాలోయింగ్ ఉన్న‌ట్లుంది అని అన్నాడు. మొత్త‌మ్మీద‌, మ‌హేష్ హవా సెల‌బ్రిటీల పిల్ల‌లకు కూడా చేరిన‌ట్లుంది.

Loading...

Leave a Reply

*