అయ్యో… విద్యాబాలన్ కూడా విడాకులు తీసుకుంటుందా…

untitled-3

బాలీవుడ్ లో ఈ మధ్య ఈ విడాకుల గోల ఎక్కువైంది. హృతిక్ రోషన్ తన భార్య నుంచి విడిపోయాడు. అటు మలైకా అరోరా కూడా అర్బాజ్ ఖాన్ కు టాటా చెప్పేసింది. ఇప్పుడీ దారిలో విద్యాబాలన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఏరికోరి మరీ పెళ్లిచేసుకున్న సిద్దార్థ్ రాయ్ కపూర్ ను పక్కన పెట్టాలని విద్యాబాలన్ ఫిక్స్ అయిందట. దాదాపు నాలుగేళ్ల కిందట వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడా వైవాహిక బంధానికి బైబై చెప్పేయాలని విద్యాబాలన్ అనుకుంటోందట. ప్రస్తుతం బాలీవుడ్ లో నడుస్తున్న అతిపెద్ద పుకారు ఇదే.

నిప్పు లేనిదే పొగరాదంటారు. అంతో ఇంతో వాస్తవం లేనిదే పుకారు కూడా బయటకు రాదు. సో.. విద్యాబాలనే వైవాహిక బంధంపై కూడా కొన్ని వాస్తవాలు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ పుకారు బయటకు రావడానికి కారణం విద్యాబాలన్ భర్త. ఒకే ఊరిలో ఉంటూ వేర్వేరు ఫ్లాట్స్ లో నివసిస్తున్నారట ఈ భార్యభర్తలు. అలా చేస్తే మరి పుకార్లు ఎందుకు రావు చెప్పండి…

కానీ విద్యాబాలన్ మాత్రం తమ మధ్య అభిప్రాయబేధాలు లేవంటోంది. ఇలాంటి పుకార్లకు స్పందించాల్సిన అవసరం తనకు లేదని… చదువుకొని నవ్వుకుంటానని అంటోంది.మరి అలాంటప్పుడు భర్తతో దిగిన ఓ సెల్ఫీ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టాల్సిందిగా మీడియా కోరిందట. ఆ పనికి మాత్రం విద్యాబాలన్ నో చెబుతోంది. భర్తతో దిగిన ఫొటోను పోస్ట్ చేయడానికే ఇంత ఇబ్బంది పడుతోందంటే… ఏదో ఉన్నట్టే కదా…

Loading...

Leave a Reply

*