వెంక‌టేష్ ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవా.. ఇల్లు అద్దెకు ఇచ్చాడు..?

venky

విక్ట‌రీ వెంక‌టేష్‌.. టాలీవుడ్ బ‌డా హీరోల‌లో ఒక‌రు. అగ్ర హీరోల‌లో ఇమేజ్ చ‌ట్రం లేకుండా.. ఎలాంటి పాత్ర‌లో అయినా ఒదిగిపోగ‌ల‌న‌ని ప్రూవ్ చేసుకున్న ఒకే ఒక్క న‌టుడు వెంక‌టేష్‌. తాజాగా తెలుగులో దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్‌ని షురూ చేసిన క‌థానాయ‌కుడు కూడా ఆయ‌నే. వాటిని పక్క‌న పెడితే.. ఇటీవ‌ల ఆయ‌న త‌న ఇంటిని రెంట్‌కి ఇవ్వ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

వెంక‌టేష్‌.. గ‌త కొన్నాళ్లుగా జూబ్లిహిల్స్‌ ఫిలింన‌గ‌ర్‌లోని రామానాయుడు స్టూడియోస్ ప‌క్క‌నే ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆ ఇంటిని ఇప్పుడు ఆయ‌న అద్దెకు ఇచ్చారు. అక్క‌డి నుంచి ఆయ‌న త‌న నివాసాన్ని మణికొండ‌లోని ఓ భ‌వంతికి మార్చుకున్న‌ట్లు స‌మాచారం. ఫిలింన‌గ‌ర్ ఏరియాలో నిత్యం ర‌ద్దీ పెర‌గ‌డం, స్టూడియోకి దగ్గ‌ర‌లోనే కావ‌డంతో సంద‌ర్శ‌కుల తాకిడితో అక్క‌డ ఇబ్బందిగా మారింద‌ట వెంక‌టేష్‌కి. దీంతో, ఆ ఇంటి నుంచి మారాల‌ని ఎప్ప‌టినుంచో అనుకుంటున్నా.. ఇన్నాళ్ల‌కు ముహూర్తం కుదిరింద‌ట‌.

వెంక‌టేష్ వెకేట్ చేసిన ఇంటిని అద్దెకు ఇచ్చార‌ట‌. ఆయ‌న ఇంటి ప‌క్క‌నే కొంత ఖాళీ స్థ‌లం కూడా ఉండ‌డంతో అదంతా ఇప్పుడు ఓ పెద్ద బిజినెస్ హ‌బ్‌గా మారింద‌ట‌. ఆ ఏరియాలో ఈ రేంజ్‌లో ఖాళీ ప్లేస్‌.. ఫుడ్ హ‌బ్ లేక‌పోవ‌డంతో దీనికి ఫుల్ డిమాండ్ పెరిగింద‌ట‌. మ‌రోవైపు, కొత్త ఇంటిలో ఫుల్‌గా సెటిల‌య్యాడ‌ట‌. కొన్నాళ్ల‌నుంచి ట్రాఫిక్‌తోపాటు జ‌నాల ర‌ద్దీతో స‌త‌మ‌త‌మ‌వుతున్న వెంకీ ఇప్పుడు ఊపిరిపీల్చుకున్నాడ‌ట‌. ఇదీ వెంకీ ఇల్లు అద్దెకు ఇవ్వ‌డానికి వెనుక ఉన్న అస‌లు క‌థ‌. అంతేకానీ, హీరోగా, స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా వేల కోట్ల వార‌స‌త్వం పొందిన వెంకీ ద‌గ్గ‌ర డ‌బ్బులు లేక‌పోవ‌డం అనేది స‌మ‌స్య కానే కాదు.. !

Loading...

Leave a Reply

*