ఇది కచ్చితంగా మేటర్ ను సైడ్ చేసే ప్రయత్నమే…

v

దర్శకుడు వేణుశ్రీరాం గుర్తున్నాడా.. అప్పుడెప్పుడో సిద్దార్థ్ ను హీరోగా పెట్టి ఓ మై ఫ్రెండ్ అనే ఫ్లాప్ సినిమా చేశాడు. మళ్లీ కనిపించలేదు. అయితే ఈమధ్య కాలంలో ఇతడు తరచుగా వార్తల్లోకెక్కుతున్నాడు. దానికి కారణం వేణు శ్రీరాం దగ్గర ఓ మంచి కథ ఉంది. అది మంచిదా కాదా అనే విషయాన్ని పక్కనపెడితే ఆ కథలో నటించడానికి మొదట రవితేజ ఒప్పుకొని తప్పుకున్నాడు. తర్వాత అదే కథకు నాగ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తప్పుకున్నాడు. ఇప్పుడు అదే స్టోరీతో నాని సినిమా చేయబోతున్నాడనేది తాజా న్యూస్.

అయితే ఆ కథపై ఇప్పటికే చాలా నెగెటివ్ ఇంపాక్ట్ పడింది. రవితేజ, నాగార్జున లాంటి బడాస్టార్లు తప్పుకోవడంతో అలాంటి కథ మనకెందుకులే అని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఆ ఎఫెక్ట్ నేచురల్ స్టార్ నానిపై కూడా పడే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు దిల్ రాజు కోటరీ ఓ సరికొత్త ప్రచారం మొదలుపెట్టింది. అబ్బే అలాంటిదేం లేదు.. ఆ కథ వేరు.. ఈ కథ వేరు అంటూ కొత్త సాంగ్ అందుకుంది.

రవితేజ, నాగార్జున రిజెక్ట్ చేసిన స్టోరీకి, నాని ఒప్పుకున్న స్టోరీకి అస్సలు సంబంధం లేదంటోంది దిల్ రాజు గ్యాంగ్. రవితేజ, నాగార్జునల కోసం వేణుశ్రీరాం మాస్ కథలు రాసుకున్నాడట. ఇప్పుడు నాని కోసం ఓ సరికొత్త ఫ్యామిలీ డ్రామా కథ రాసుకున్నాడట. ఇంత వేగంగా కథలు రాసే వేణుశ్రీరాం ఇన్నాళ్లు ఎందుకు గ్యాప్ తీసుకుంటాడు చెప్పిండి.. ఎక్కడో ఏదో కొడతోంది కదా…

Loading...

Leave a Reply

*