రెండో ఆలోచన చేస్తున్న వెంకీ…

venky

ఇప్పటికే రెండో ఇంటికి మారిన వెంకటేశ్.. ఇప్పుడు తన సినిమాపై కూడా రెండో ఆలోచన చేస్తున్నాడట. శరవేగంగా ముస్తాబవుతున్న గురు సినిమాకు సంబంధించి సెకెండ్ థాట్ లో వెంకీ ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాను వెంకీ తలుచుకంటే సంక్రాంతి బరిలో సులభంగా దించొచ్చు. ఎందుకంటే. ఇప్పటికే 70శాతం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈనెలాఖరకు సినిమా మొత్తం అయిపోతుంది. డిసెంబర్ రెండో వారానికే ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. . సో.. సంక్రాంతికి బరిలో దిగడం పెద్ద సమస్య కాదు.

కానీ అనవసరపు పోటీకి ఎప్పుడు వెంకీ వ్యతిరేకమే. థియేటర్లలో ఊరికే కాంపిటిషన్ పెంచి, అందరూ నష్టపోవడం కంటే తను వెనక్కి తగ్గడం బెటరని వెంకీ ఎప్పుడూ ఫీల్ అవుతుంటాడు, ఈసారి కూడా అదే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం పొంగల్ రేసులో చిరు, బాలయ్య సినిమాలున్నాయి. వీటితో పాటు తన సినిమాను విడుదల చేస్తే, అది 3 సినిమాలకు నష్టమని వెంకీ భావిస్తున్నాడట. అందుకే గురు సినిమాకు ఆల్టర్నేట్ డేట్స్ చూస్తున్నాడట.

తాజా సమాచారం ప్రకారం.. గురు సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్టే. అయితే మూవీని మాత్రం అదే నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే, జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా గురు సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట వెంకటేశ్. అప్పటికి సంక్రాంతి సినిమాల హోరు కూడా తగ్గుతుందని భావిస్తున్నాడట.

Loading...

Leave a Reply

*