చిరంజీవికి కోలుకోలేని ఝలక్

untitled-7

ఇండస్ట్రీలో అజాతశత్రువుగా వెంకీకి పేరుంది. వెంకటేష్ కు ఎలాంటి ఇగోస్ ఉండవు. మరీ ముఖ్యంగా మిగతా హీరోలతో పోటీ అస్సలు ఉండదు. తను చేయాలనుకున్న పని చేస్తాడు. అందరితో మంచిగా ఉంటాడు. అలాంటి వెంకీ ఇప్పుడు చిరంజీవికి ఎర్త్ పెట్టాడని తెలుస్తోంది. వెంకటేశ్ మూలంగా చిరంజీవి ఏకంగా 4వందల థియేటర్లు కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు.

చిరంజీవి తన ప్రతిష్టాత్మక 150వ చిత్రం ఖైదీ నంబర్ 150ను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్నాడు. అలా బాహుబలి రికార్డును బద్దలుకొట్టాలనేది ప్లాన్. అయితే చిరంజీవికి పోటీగా బాలయ్య రెడీ అయ్యాడు. బాలయ్య బరిలో ఉన్నప్పటికీ…చిరు బాధపడలేదు కానీ.. వెంకీ ఇప్పుడు బరిలోకి దిగేసరికి మాత్రం చిరంజీవికి భయం పట్టుకుందట.

గురు సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలని వెంకీ భావిస్తున్నాడట. అదే కనుక జరిగితే వెంకీ అన్నయ్య, నిర్మాత సురేష్ బాబు సపోర్ట్ వెంకీకే ఉంటుంది. అలా కనుక జరిగితే సురేష్ బాబు దగ్గరున్న 400 థియేటర్లు గురు సినిమాకే వెళ్లిపోతాయి. అప్పుడు చిరంజీవి సినిమాకు కోలుకోలేని దెబ్బ పడినట్టే. ఓవైపు బాలయ్య, మరోవైపు వెంకీ… బాహుబలి రికార్డును బద్దలుకొట్టడం మెగాస్టార్ కు సాధ్యమా.. వెయిట్ అండ్ సీ…

Loading...

Leave a Reply

*