వెనక్కి తగ్గిన మెగా హీరో… కారణం అదేనా…

mega

మెగా హీరో వరుణ్ తేజ్ లోఫర్ ఏ రేంజ్ లో ఫ్లాప్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ లోనే ఒకేసారి 2 సినిమాలు సైన్ చేశాడు ఈ మెగా స్మార్ట్ హీరో. వాటిలో ఒకటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఫిదా కాగా… మరొకటి శ్రీను వైట్ల దర్శకత్వంలో చేస్తున్న కమర్షియల్ ఎంటర్ టైనర్ మిస్టర్. వరుస పరాజయాల తరువాత శ్రీను వైట్ల చేస్తున్న ఈ చిత్రంతాజా రెండో షెడ్యూల్ కూడా పూర్తిచేసుకుంది. సినిమా షూటింగ్ దాదాపు 80శాతం కంప్లీట్ అయింది. దీంతో సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఆ ఆలోచన నుంచి వెనక్కి తగ్గినట్టు సమాచారం.

ఈమధ్యే రామ్ చరణ్ తన కొత్త సినిమా డేట్ ఎనౌన్స్ చేశాడు. డిసెంబర్ లో ధృవ సినిమా సందడి చేయబోతోందని ప్రకటించాడు. అటు సూర్య కూడా తన సింగం-3 సినిమా డిసెంబర్-13న వస్తోందని డేట్ పక్కా చేశాడు. వీటితో పాటు వెంకటేశ్ గురు సినిమా కూడా డిసెంబర్ లో థియేటర్లలోకి వస్తోంది. దీంతో రిస్క్ తీసుకోవడం ఎందుకని సినిమాని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ఫిక్సయ్యారట. ఈ వార్తపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.మిస్టర్ సినిమాను వచ్చేఏడాది ఫిబ్రవరికి విడుదల చేయాలనుకుంటే… అప్పటికి ఫిదా సినిమా కూడా రిలీజ్ కు రెడీ అయిపోతుంది. అప్పుడు నాగచైతన్యలా పరిస్థితి తయారవుతుంది. సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ సినిమాలు రెండూ ఒకేసారి రెడీ అయిపోడంతో నాగచైతన్య గ్యాప్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. వరుణ్ కూడా అదే చేస్తాడేమో…

Loading...

Leave a Reply

*