నా జీవితంలో విల‌న్.. హీరో విశాల్..శ‌ర‌త్‌కుమార్ కూతురు సంచ‌ల‌నం..!

vishal

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌.. డాట‌ర్ ఆఫ్ హీరో, కేర‌క్ట‌ర్ ఆర్టిస్ట్‌, పొలిటిక‌ల్ లీడ‌ర్ శ‌ర‌త్‌కుమార్ కూతురు. ఆమె ఈ రోజు ఉద‌యం ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. కొంత‌మంది ఏడేళ్ల ప్రేమ‌బంధాన్ని నిముషంలో ఎలా తెంచుకుంటారో అర్ధం కాదు. మేనేజ‌ర్‌తో కటీఫ్ చెప్పి పంపించాడు. ప్ర‌పంచంలో మాన‌వ సంబంధాలు మంట‌క‌లిశాయి అంటూ వర‌ల‌క్ష్మీ బాధ‌తో ట్వీట్ చేసింది. ఇది ఖ‌చ్చితంగా హీరో విశాల్ గురించే అని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.గ‌త కొన్నేళ్లుగా ఈ భామ హీరో విశాల్‌తో ల‌వ్‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌లో ఈ ఇద్ద‌రూ క‌లిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన విశాల్‌.. దట్స్‌.. ఇట్..! అంటూ మెస్సేజ్ పెట్టాడు.

 

ఆ త‌ర్వాత న‌డిగ‌రం సంఘం ప్రెసిడెంట్‌గా ఆయ‌న నిర్మిస్తున్న క‌ల్యాణ‌మండ‌పంలో జ‌రిగే తొలి పెళ్లి త‌న‌దే అని చెప్పాడు. దీంతో, శ‌ర‌త్ కుమార్ కూతురు వర‌ల‌క్ష్మీతో విశాల్‌ మ్యారేజ్ గ్యారంటీ అంటూ భావిస్తూ వచ్చారు. అయితే, గ‌త కొన్నాళ్లుగా శ‌ర‌త్ కుమార్‌, విశాల్ మ‌ధ్య హాట్ ఫైట్ జ‌రుగుతోంది. న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల‌లో శ‌ర‌త్ కుమార్ టీమ్‌ని విశాల్ టీమ్ ఘోరంగా ఓడించింది. దీనికితోడు, ఇద్ద‌రి మ‌ధ్య వ్య‌క్తిగ‌త విష‌యాలలోనూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. దీంతో, కోలీవుడ్‌లో మామ‌కు య‌ముడు, అమ్మాయికి మొగుడు అనే కామెంట్స్ వినిపించాయి.

 

అయితే, శ‌ర‌త్ కుమార్‌తో ఉన్న విబేధాల కార‌ణంగానే వ‌ర‌ల‌క్ష్మీతో పెళ్లికి నో చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమెను పెళ్లి చేసుకోవాల‌ని ఉన్నా శ‌ర‌త్‌కుమార్‌-రాధికా దంప‌తులతో త‌న‌కు ఉన్న వైరం స‌మ‌సిపోయేలా క‌నిపించడం లేద‌ని భావిస్తున్నాడ‌ట విశాల్‌. దీంతో, వ‌ర‌లక్ష్మీతో అఫైర్‌ని త‌న మేనేజ‌ర్‌తో ఇష్టం లేకున్నా చెప్పించాడ‌నే వార్త‌లు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో మ‌లుపులు తిరుగుతున్న ఈ ఎపిసోడ్‌.. ఫైన‌ల్‌గా ఎలాంటి ట్విస్ట్ తీసుకుంటుందో చూడాలి.

ఇదీ వ‌ర‌ల‌క్ష్మీ ట్వీట్‌..

Breakups hv reached a new low.. a guy broke up a 7yr relationship thru his manager.. lol what’s has the world come too..whr is the love..?!
– varu sarathkumar (@varusarath) September 28, 2016

Loading...

Leave a Reply

*