ఊపిరి దర్శకుడికి గుండె జారింది…

oopiri

ఊపిరితో సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆ తర్వాత మరో ప్రాజెక్టు ఎనౌన్స్ చేయలేదు. దీనికి కారణం మహేష్ బాబు. అవును.. కొన్నేళ్లుగా మహేష్ కోసం వెయిట్ చేస్తున్న వంశీ పైడపల్లి..ఈసారి ప్రిన్స్ తో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. పీవీపీ బ్యానర్ లో మూవీ కూడా సెట్ అయిపోయింది. ఆమధ్య మహేష్ పుట్టినరోజు సందర్భంగా బ్యానర్లు కూడా బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు వంశీకి మరోసారి ఝలక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయిు.మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ 23వ సినిమా చేస్తున్నాడు. తర్వాత…

కొరటాలతో చేయబోయేది 24వ చిత్రం అవుతుంది. ఆ తర్వాత తన ప్రతిష్టాత్మక 25వ చిత్రాన్ని త్రివిక్రమ్ చేతిలో పెట్టే ఆలోచనలో ఉన్నాడట మహేష్. దీంతో వంశీ పైడిపల్లికి షాక్ తప్పలేదు. ఇటీవలే మహేష్ ను కలిసిన త్రివిక్రమ్ ఓ స్టోరీ లైన్ చెప్పాడట. దానికి ఓ రేంజ్ లో ఇంప్రెస్ అయిపోయిన మహేష్ వెంటనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడని తాజా ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా కొరటాలతో పనిచేశాక మహేష్ 25వ చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. అప్పటికి త్రివిక్రమ్ కూడా పవన్ తో చేయబోయే సినిమాను కంప్లీట్ చేస్తాడని సమాచారం.

శ్రీమంతుడు నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ తో తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమాకు అగ్రిమెంట్స్ కూడా అయిపోయాయనే షాకింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదే గనుక నిజమైతే.. ఈ కమిట్మెంట్ తో వంశీ పైడిపల్లికి పెద్ద షాక్ తగిలినట్లే అవుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను కూడా వదులుకుని వెయిట్ చేస్తోన్న వంశీ ఇప్పుడు ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది

Loading...

Leave a Reply

*