చెర్రీ సీక్రెట్స్ పై ఉపాసన క్లారిటీ …

untitled-2

రామ్ చరణ్ – ఉపాసన జోడీకి సంబంధించి 3 విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా నే ఉంటాయి. వీటిలో ఒకటి పెళ్లి టైం లో ఉపాసన చాలా లావుగా ఉందనే విషయం. ఇక రెండోది వాళ్లిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే పుకారు. ఇక మూడోది ఈ జంటకు పిల్లలు ఎప్పుడు పుడతారనే విషయం ఈ మూడు హాట్ టాపిక్స్ పై ఉపాసన క్లారిటీ ఇచ్చింది. చెర్రీకి తను సూట్ కాననే విషయాన్ని తిప్పికొట్టింది ఉపాసన. అప్పట్లో అంతా తన ఫిజిక్ పై కామెంట్స్ చేశారని… కానీ ఇప్పుడు మెగా పవర్ స్టార్ కు సూట్ అయ్యే రేంజ్ లో తయారయ్యానని చెప్పుకొచ్చింది.

ఇక విడాకుల విషయంపై స్పందిస్తూ.. తాము కూడా అందరి జంటల్లానే చాలా నార్మల్ గా క్లోజ్ గా ఉంటామని.. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు బాధేస్తుందని చెప్పుకొచ్చింది. అయినా నిజంగా విడాకులు తీసుకుంటే దాకుచునేంత పిరికివాళ్లం కాదని క్లారిటీ ఇచ్చింది. చెర్రీది తనది ది బెస్ట్ కాంబినేషన్ అని.. విడాకుల వార్తలు వచ్చిన ప్రతిసారి మేం నవ్వుకున్నామని ఉపాసన తెలిపింది.

ఇక పిల్లల విషయానికొస్తే… పెళ్లయి నాలుగేళ్లే అయింది కాబట్టి పిల్లలపై ఇంకా ఆలోచించలేదని చెప్పుకొచ్చింది. నిజంగా పిల్లలు కావాలని కోరుకుంటే… అపోలో మొత్తం తమ వెంట ఉందని.. అది పెద్ద సమస్య కాదని ఉపాసన తెలిపింది. అయితే పిల్లలపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని అంటోంది ఉపాసన.

Loading...

Leave a Reply

*