కమల్ హాసన్ తో ప్రభాస్ కు పోలిక

kamal

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ గర్వపడేలా, సౌత్ సినీ ప్రేమికులు ఆనంద పడేలా బ్యాంకాక్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే గుడ్ న్యూస్ రీసెంట్ గా బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఈ గుడ్ న్యూస్ తెలిసీ తెలియగానే ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది. అటు ప్రభాస్ ను, ఇటు బాహుబలి టీమ్ ను అందరూ అభినందనల్లో ముంచెత్తారు. కానీ, అసలు కథ ఆ తర్వాత నుంచే మొదలైంది.సౌత్ సినీ సర్కిల్ లో హేమాహేమీలను వదిలేసి ప్రభాస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఏంటనే వాదన ఎక్కువైంది. అందులోనూ కోలీవుడ్ మీడియా సర్కిల్ లో అయితే దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. సౌత్ సినీ ప్రముఖులనే తీసుకుంటే ముందుగా ఎంజీఆర్ విగ్రహం ఉండాలి కదా అని చాలామంది వాదిస్తున్నారు.

లేదంటే ప్రస్తుతం ఉన్న నటుల్లో విలక్షణ నటుడు కమల్ హాసన్ విగ్రహమైన ఏర్పాటు చేయాలి కదా అనే వాదన వినిపిస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే సౌత్ లో ఎంజీఆర్, శివాజీ గణేషన్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి నటుల విగ్రహాలు పెట్టడానికి ప్రత్యేకంగా ఓ మ్యూజియం ఉండాలేమో. ఈ విధంగా కమల్ హాసన్ తో పోలుస్తూ ప్రభాస్ ను తమిళ మీడియా బాగానే టార్గెట్ చేసిందని తెలుస్తోంది.మరోవైపు ప్రభాస్ మైనపు విగ్రహం పెడుతున్నారనే వార్త అందరికీ తెలిసినప్పటికీ తెలుగు చిత్రసీమ ఎందుకో పెద్దగా స్పందించలేదనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. బహుశా… టాలీవుడ్ పెద్దలు కూడా తమిళ జనాల ఫీలింగ్ లోనే ఉన్నట్టున్నారు.

Loading...

Leave a Reply

*