చెర్రీ లైవ్ షోకు ప్రత్యేక అతిథిగా డొనాల్డ్ ట్రంప్

untitled-78

డొనాల్డ్ ట్రంప్… ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియనివారు ఉండరేమో. నిన్నగాకమొన్న రాజకీయాల్లోకి వచ్చిన ట్రంప్… అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఏకంగా అమెరికా అధ్యక్ష బరిలో నిలిచారు. అయితే ప్రస్తుతం ఆయనకు అగ్రరాజ్యంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అది వేరే విషయం. ఇక మన విషయానికొస్తే… ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ సెలబ్రిటీగా పేరుతెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్.. రామ్ చరణ్ లైవ్ పర్ ఫార్మెన్స్ చూడ్డానికి వస్తున్నాడట.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ నెల 15న అమెరికాలోని న్యూజెర్సీలో పీఎన్సీ ఆర్ట్ సెంటర్ లో గ్రాండ్ గా జరగనున్న హ్యుమానిటీ ఎగైనెస్ట్ టెర్రర్ అనే ఈవెంట్ లో డాన్స్ చేయబోతున్నాడు. కాశ్మీరీ పండిట్లపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయిన వారిని ఆదుకోవడానికి ‘రిపబ్లికన్ హిందూ కొయిలిషన్’ (ఆర్.హెచ్.సీ) అనే సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది.

దీంతో వచ్చే మొత్తం అమౌంట్ ను టెర్రరిస్ట్ బారిన పడి నష్టపోయిన కుటుంబాల్ని ఆదుకోవడం కోసం ఉపయోగిస్తారు. అందుకే మన చెర్రీ కూడా ఎటువంటి పారితోషికం తీసుకోకుండా.. ఇందులో డాన్స్ కు రెడీ అయిపోయాడు. ఇప్పుడూ కార్యక్రమానికి ట్రంప్ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నాడట.ఈ కార్యక్రమంలో చెర్రీతో పాటు సిసింద్రీ అఖిల్ కూడా డాన్స్ చేయబోతున్నాడు. వీళ్లిద్దరూ ట్రంప్ ను కలిసే అవకాశం ఉంది. కదిరితే ట్రంప్ తో సెల్ఫీలు కూడా దిగే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతం ప్రచార పర్వంలో తెగ బిజీగా ఉన్న ట్రంప్… ఈ కార్యక్రమానికి వస్తాడా రాడా అనేది తేలాల్సి ఉంది.

Loading...

Leave a Reply

*