తారక్, త్రివిక్ర‌మ్ మ‌ధ్య‌లో నిర్మాత‌

ntr

తార‌క్‌, త్రివిక్ర‌మ్ మ‌ధ్య‌లో నిర్మాత‌… ఇది కొత్త సినిమా టైటిల్ కాదు…. త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌బోయే క్రేజీ కాంబినేష‌న్‌… త్రివిక్ర‌మ్‌, తార‌క్ క్రేజీ కాంబినేష‌న్ అంటే జ‌నానికి జ్వ‌రం వ‌చ్చేస్తుంది… టాలీవుడ్‌కి ఫీవ‌ర్ ప‌ట్టుకుంటుంది… మాట‌ల మాంత్రికుడు, డైలాగ్ డైన‌మైట్‌ క‌లిస్తే ఏమ‌వుతుంది… పేలుళ్లు సంభ‌విస్తాయి.. ఆంధ్రాలో బాంబులు పేల‌తాయి.. థియేట‌ర్ల‌లో సినిమా ఆట‌లు కాదు… ఆటంబాంబులు పేల‌తాయి… తెరి చిరిగిపోయే కాంబినేష‌న్ ఇది… పెట్రోల్‌కి నిప్పు త‌గిలితే ఏమ‌వుతుంది… అలాంటి ఫైర్ బ్రాండ్ కాంబినేష‌న్ ఇది… పెన్ను గ‌న్ను క‌లిసి గర్జించే కాంబినేష‌న్ ఇది….త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయాల‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎప్ప‌ట్నించో త‌హ‌త‌హ‌లాడుతున్నాడు… అఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ మ‌రే సినిమా చేయ‌కుండా ఆయ‌న‌ను లాక్ చేసేశాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌..

దీంతో రాయబారాలు కూడా న‌డిపి విఫ‌ల‌మ‌య్యాడు తార‌క్‌… త్రివిక్ర‌మ్‌తో తార‌క్ సినిమా లేద‌ని తెలిసి ఫ్యాన్స్ ఉస్సూరుమ‌న్నారు… అయితే ఇప్పుడు తార‌క్ అభిమానుల‌కు తియ్యటి వార్త అందిస్తున్నాడు త్రివిక్ర‌మ్‌… తార‌క్‌తో సినిమా చెయ్య‌డానికి ప‌చ్చ‌జెండా ఊపాట్ట ఈ టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్‌… గ‌తంలో అత్తారింటికి దారేది సినిమా తీసిన నిర్మాత భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ రాయ‌బారం న‌డిపి తార‌క్‌తో సినిమా చెయ్య‌డానికి త్రివిక్ర‌మ్‌ని ఒప్పించాట్ట‌… ఇప్పుడు త‌న త‌న క‌లాన్నిఝ‌ళిపించి తార‌క్ కోసం స్టోరీ అల్లుతున్నాట్ట త్రివిక్ర‌మ్‌.. జూనియ‌ర్ ఎన్టీఆర్ కోసం క‌థ రాసుకుంటున్నాట్ట…

అస‌లు భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్‌.. త్రివిక్ర‌మ్‌ని ఒప్పించ‌డం పెద్ద మిస్ట‌రీగా మారింది.. ఎందుకంటే అత్తారింటికి దారేది సినిమా విష‌యంలో రెమ్యూన‌రేష‌న్ గురించి నిర్మాత‌తో త్రివిక్ర‌మ్‌కి గొడ‌వ‌లు వ‌చ్చాయి.. దీంతో అప్ప‌ట్నించి బ‌య‌ట నిర్మాత‌ల‌కు చెయ్య‌కూడ‌ద‌ని త్రివిక్ర‌మ్ నిర్ణ‌యించుకున్నాట్ట‌.. అయితే తాను నొప్పించిన‌ త్రివిక్ర‌మ్‌ని తార‌క్‌తో సినిమా చేసేలా ఎలాగోలా ఒప్పించాడు భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్‌… దీంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు…. అయితే త్వ‌ర‌లో ప‌వ‌న్‌తో ఆ త‌ర్వాత మ‌హేష్‌తో సినిమా చేశాక జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమాకి శ్రీకారం చుడ‌తాట్ట త్రివిక్ర‌మ్‌.

Loading...

Leave a Reply

*