ఎన్టీఆర్‌కి అడ్వాన్స్ ఇచ్చిన త్రివిక్ర‌మ్ నిర్మాత‌.. 15 కోట్లు చెక్ ఇచ్చాడు..!

ntr

హారిక హాసిని క్రియేష‌న్స్‌. ఈ పేరు వింటే చాలు.. అది త్రివిక్ర‌మ్ సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. జులాయి, అ.. ఆ, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి.. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీ. ఇలా త్రివిక్ర‌మ్ ఓన్ బ్యాన‌ర్‌గా స్థిర‌పడిపోయింది ఈ సంస్థ‌. గ‌త కొన్నాళ్లుగా ఎన్టీఆర్‌-త్రివిక్రమ్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చెయ్యాల‌ని ట్రై చేస్తున్నాడు. కానీ అది వ‌ర్క‌వుట్ అవ‌డం లేదు.

మొద‌ట వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఏవో ఇగో ప్రాబ్ల‌మ్స్ అన్నారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాతోనే ఆగిపోయింద‌నే టాక్ వ‌చ్చింది. కానీ, ఫైన‌ల్‌గా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. త్రివిక్ర‌మ్ నిర్మాణ సంస్థ‌గా భావిస్తున్న హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ‌.. తార‌క్‌తో డీల్ కుదుర్చుకుంద‌ట‌. ఇప్ప‌టికే భారీ అడ్వాన్స్‌తో చెక్ కూడా ఇచ్చింద‌ట‌. మిగిలిన పేమెంట్‌ని కూడా త్వ‌ర‌లోనే క్లియ‌ర్ చేస్తామని తెలిపింద‌ట‌. ఇది గ్యారంటీగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోనే ఉంటుంద‌ని చెబుతున్నారు.

మాట‌ల మాంత్రికుడు నుంచి క్లియ‌రెన్స్ వ‌చ్చిన త‌ర్వాతే తార‌క్ సినిమాకి ఆ నిర్మాత డీల్ కుదుర్చుకున్నాడ‌ని స‌మాచారం. ఇదే నిజ‌మ‌యితే, యంగ్‌టైగ‌ర్ అభిమానుల‌కు ఇది గుడ్ న్యూస్‌. వ‌చ్చే ఏడాది స్టార్టింగ్‌లో ఈ చిత్రం షురూ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే,ఈ సినిమాకి ముందేతార‌క్ మ‌రో మూవీ చెయ్య‌నున్నాడ‌నే ప్ర‌చారం సాగుతోంది. మ‌రి, అది ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో అనేది హాట్ టాపిక్‌గా మారింది.

Loading...

Leave a Reply

*