మ‌హేష్‌తో త్రివిక్ర‌మ్ క‌టీఫ్‌.. ఎన్టీఆర్‌తో సినిమా..!

3

తార‌క్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌.. సూప‌ర్‌స్టార్ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌లా ఉంది క‌దూ ఈ వార్త‌. త్రివిక్ర‌మ్‌తో సినిమా అంటే అంతే మ‌రి. అలాగే ఉంటుంది. హీరోల రేంజ్ స్టార్‌డ‌మ్, క్రేజ్ ఆయ‌న సొంతం. అయితే, మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మ‌ధ్య విబేధాలు ఇది నిజ‌మేంటున్నారు సినీజ‌నాలు. మ‌హేష్ ప్ర‌స్తుతం మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది వ‌చ్చే ఏడాది విడుద‌లకానుంది. దాని త‌ర్వాత ఆయ‌న కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రానికి క‌మిట‌య్యాడు. ఇది వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి రానుంది.కొన్ని రోజుల క్రితం మ‌హేష్‌కి ఓ క‌థ చెప్పాడ‌ట ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌.

అది మ‌హేష్‌కి బాగా క‌నెక్ట్ అయింద‌ట‌. వెంట‌నే ఈ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట సూప‌ర్‌స్టార్‌. అయితే, సినిమా ప్ర‌క‌టించ‌డంపై ఇద్ద‌రి మ‌ధ్య చిన్న అభిప్రాయ బేధాలు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. సినిమా ఓకే చేసిన వెంట‌నే.. దానిని బ‌య‌ట అనౌన్స్ చెయ్యాల‌ని మ‌హేష్ త్రివిక్ర‌మ్‌ని కోరాడ‌ట‌. దానికి మాట‌ల మాంత్రికుడు నో చెప్పాడ‌ట‌. గ‌తంలో పూరితోనూ ఓ సినిమా చేస్తాన‌ని చెప్పి.. మహేష్ హ్యాండిచ్చాడ‌ని భావించిన మాట‌ల మాంత్రికుడు.. ఆ సినిమాని మ‌హేష్‌నే అనౌన్స్ చెయ్యాల‌ని భావించాడ‌ట‌. ఇదే ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్‌ని పెంచిందనే ప్రచారం జ‌రుగుతోంది.

ఈ విష‌యం జరిగి నెల‌లు జ‌రుగుతున్నా.. మ‌హేష్ టీమ్ నుంచి చిన్న హింట్ కూడా రాలేదట‌. ఇదే టైమ్‌లో జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత తార‌క్ త్రివిక్ర‌మ్‌తో సినిమా చెయ్యాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నాడు. అందులోనూ మ‌హేష్‌కి చెప్పిన స్టోరీలైన్ తార‌క్‌కి కూడా బాగా న‌చ్చింద‌ట‌. దీంతో, ఆ సినిమాపై మొద‌ట త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డ్డ మాట‌ల మాంత్రికుడు.. ఫైన‌ల్‌గా యంగ్‌టైగర్‌తో ఆ మూవీకి క‌మిట‌య్యాడ‌ని రూమ‌ర్‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లోనే ఈ సినిమా షూటింగ్ షురూ అవనుంద‌ని స‌మాచారం. ఇదే క‌నుక నిజ‌మైతే తార‌క్ ఫ్యాన్స్‌కి ఇది పండ‌గే.

Loading...

Leave a Reply

*