త్రివిక్రమ్ కు 10కోట్లు లాస్..

tr

అది కూడా పవన్ కల్యాణ్ వల్ల త్రివిక్రమ్ కు 10కోట్లు లాస్ వచ్చిందనే వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు మేటర్ లోకి వెళ్దాం. అ..ఆ సినిమా తర్వాత పవన్ తో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అయ్యాడు. పవన్ కూడా ఓకే చేశాడు. కాటమరాయుడు సినిమాను వీలైనంత తొందరగా పూర్తిచేసి, తర్వాత త్రివిక్రమ్ తో సినిమా అనుకున్నాడు. కానీ కాటమరాయుడు అనుకోని విధంగా ఆలస్యమైంది. అది నిజంగా లేట్ అవుతుందని తెలిస్తే, త్రివిక్రమ్ ఓ చిన్న సినిమా ఒప్పుకునేవాడు.

అవును… పవన్ తో సినిమా కమిట్ కాకముందే.. ఓ చిన్న సినిమా చేయమని త్రివిక్రమ్ కు క్రేజీ ఆఫర్ వచ్చింది. జస్ట్ 3 నెలల్లో కంప్లీట్ అయ్యేలా… లో-బడ్జెట్ లో ఓ సినిమా చేస్తే 10కోట్లు ఇస్తానని, ఓ బడా నిర్మాత నుంచి త్రివిక్రమ్ కు ఆఫర్ వచ్చింది. అయితే పవన్ తో సినిమా తొందరగా స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో… త్రివిక్రమ్ ఆ క్రేజీ ఆఫర్ ను సున్నితంగా వదులుకున్నాడట.

కట్ చేస్తే.. ఇప్పుడు పవన్ సినిమా లేట్ అవుతోంది. త్రివిక్రమ్ ఖాళీ అయిపోయాడు. సో.. అలా చూసుకుంటే త్రివిక్రమ్ 10 కోట్లు లాస్ అయినట్టే కదా. కానీ ఫ్రెండ్ షిఫ్ లో ఇలాంటివేం చూసుకోకూడదంటున్నాడు త్రివిక్రమ్. పవన్ కోసం 3 నెలలు కాదు… అవసరమైతే మరో ఏడాది కూడా వెయిట్ చేస్తానని అంటున్నాడు. తనకు ఇతర సినిమాల కంటే పవన్ తో సినిమా చేయడం, అతడితో రిలేషన్ షిప్ ను కంటిన్యూ చేయడం చాలా ఇష్టం అంటున్నాడు మాటల మాంత్రికుడు.

Loading...

Leave a Reply

*