రూ.200 కోట్ల టర్నోవర్… ఆదాయం మాత్రం నిల్…

trivikram

క్షణం తీరిక లేదు… పైసా ఆదాయం లేదనే సామెత తెలుగులో చాలా పాపులర్. ఇప్పుడీ సామెతను దర్శకుడు త్రివిక్రమ్ కు యాజ్ ఇటీజ్ గా వాడేయొచ్చు. అవును.. ఈ దర్శకుడి చుట్టూ ఇప్పుడు వందల కోట్ల రూపాయల బెట్టింగ్ సాగుతోంది. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. త్రివిక్రమ్ కు ఎవరూ పైసా ఇవ్వలేదు. కానీ త్రివిక్రమ్ మాత్రం హాట్ కేకే. ఇదే ఇప్పుడు విచిత్ర పరిస్థితి.

అ..ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ రేంజ్ ఇంకా పెరిగింది. ఇతడితో సినిమా చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. కానీ త్రివిక్రమ్ మాత్రం పవన్ చెంతే ఉండిపోయాడు. పవన్ రిలీజ్ చేస్తే, ఈ 4 నెలల్లో ఎన్టీఆర్ తో సినిమా చేసేయొచ్చు. ఇదొక 80కోట్ల రూపాయల బెట్టింగ్. మరోవైపు త్రివిక్రమ్ కోసం మహేష్ బాబు కూడా వెయిటింగ్. మురుగదాస్ తో సినిమా కంప్లీట్ అయిన వెంటనే కుదిరితే త్రివిక్రమ్ కే కాల్షీట్ ఇవ్వాలనుకుంటున్నాడు మహేష్. ఇది కూడా దాదాపు 70-80కోట్ల రూపాయల డీలింగే.

ఎన్టీఆర్, మహేష్ మాత్రమే కాదు… వీళ్లకంటే ముందే పవన్.. త్రివిక్రమ్ ను రిజర్వ్ చేసుకున్నాడు. ఇది కూడా దాదాపు 70కోట్ల రూపాయల డీలే. ఇలా త్రివిక్రమ్ చుట్టూ దాదాపు 2వందల కోట్ల రూపాయల మేర మార్కెట్ ఉంది. కానీ ఏదీ ఫైనలైజ్ కాలేదు. త్రివిక్రమ్ కు ఎవరూ అడ్వాన్స్ ఇవ్వలేదు. అది ఇప్పుడు త్రివిక్రమ్ పరిస్థితి.

Loading...

Leave a Reply

*