త్రివిక్రమ్ ను మరోసారి లైన్లో పెట్టాడట…

untitled-15

ఇప్పటికే త్రివిక్రమ్ తో అ..ఆ సినిమా చేశాడు నితిన్. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. త్రివిక్రమ్ చలవతో ఓవర్సీస్ లో కూడా మార్కెట్ పెంచుకున్నాడు. అందుకే మరోసారి ఆ స్టార్ డైరక్టర్ ను లైన్లో పెట్టే ప్లానింగ్ లో ఉన్నాడట నితిన్. కుదిరితే తన నెక్ట్స్ సినిమాలో త్రివిక్రమ్ ను కూడా పార్ట్ చేయాలని చూస్తున్నాడట. దీనికి సంబంధించి మరికాసేపట్లో ప్రకటన కూడా చేయబోతున్నాడు పవన్.

ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎఁటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ మూవీతో పాటు త్వరలోనే పవన్ కల్యాణ్ స్థాపించిన పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ పై కూడా ఓ సినిమా చేయబోతున్నాడట.ఆ సినిమాకే త్రివిక్రమ్ కథా సహకారం అందించబోతున్నాడని తెలుస్తోంది. అయితే దర్శకుడు ఎవరనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

నిజానికి పవన్ కల్యాణ్ బ్యానర్ పై రామ్ చరణ్ హీరోగా సినిమా నిర్మిద్దామనేది పవర్ స్టార్ ఆలోచన. ఆ సినిమాకు త్రివిక్రమ్ ను దర్శకుడిగా పెడదామని కూడా అనుకున్నాడు. కానీ చెర్రీ, పవన్ ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉండడం.. మరోవైపు తన వీరాభిమాని నితిన్ ఫోర్స్ చేయడంతో పవన్ అతడితో సినిమా చేసేందుకు సై అన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ డీల్ మొత్తంలో త్రివిక్రమ్ కు బాగానే డబ్బు ముట్టజెప్పినట్టు టాక్ నడుస్తోంది.

Loading...

Leave a Reply

*