స్టార్ హోటల్ బిజినెస్ లోకి త్రిష

trisha

త్రిష ఓ స్టార్ హోటల్ పెట్టబోతోందని… కుదిరితే హైదరాబాద్ లోనే ఓ స్టార్ హోటల్ నిర్మించబోతోందనే వార్తలు ఎప్పట్నుంచో ప్రచారంలో ఉన్నాయి. కానీ అవేవీ ఇప్పటివరకు వర్కవుట్ కాలేదు. అయితే తాజాగా మరోసారి ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. త్రిష ఈసారి కచ్చితంగా స్టార్ హోటల్ పెడుతుందని అంటున్నారు. అయితే హైదరాబాద్ లో కాకుండా.. బెంగళూరులో త్రిష హోటల్ బిజినెస్ ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. ఈ స్టార్ హోటల్ 60 లగ్జరీ సూట్స్ , రూమ్స్ తో అద్భుతంగా ఉండబోతుందట.

త్రిష స్టార్ హోటల్ ను ప్రారంభించడం వెనుక ఓ ఎమోషనల్ స్టోరీ దాగుందని సమాచారం. త్రిష తండ్రి కృష్ణన్ ఓ స్టార్ హోటల్ లో పనిచేసేవారట. అప్పట్లో ఆయన ఎప్పటికైనా సొంతంగా ఓ హోటల్ ను కలిగి ఉండాలని కలలు కనేవారట. కానీ, ఆ కోరిక నెరవేరకుండానే ఆయన చనిపోయారు. అందుకే ఇప్పుడు తన తండ్రి కలను నిజం చేయాలని త్రిష ఓ అందమైన స్టార్ హోటల్ ను నిర్మిస్తుందట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

మరోవైపు త్రిషకు కూడా స్టార్ హోటల్ మెయింటెనెన్స్ పై పూర్తి అవగాహన ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే గడిచిన నాలుగేళ్లుగా ఈ రంగంపై చిన్నపాటి రీసెర్చ్ కూడా చేసిందట. సినిమా అవకాశాలు తగ్గిన వెంటనే హోటల్ బిజినెస్ లోకి ఎంటరైపోవాలని రెడీగా ఉందట. ఇన్నాళ్లకు ఆ ముహూర్తం రానే వచ్చింది. త్రిషకు సినిమాలు తగ్గి, ఫ్రీ టైం పెరిగింది.

Loading...

Leave a Reply

*