మ‌హేష్ సినిమాకి క‌ళ్లు చెదిరే బిజినెస్‌.. కొత్త రికార్డ్‌..!

mahi-1

మ‌హేష్-మురుగ‌దాస్ చిత్రం విడుద‌ల‌కు ముందే రికార్డ్‌లు కొల్ల‌గొడుతోంది. సౌత్‌లో భారీ అంచ‌నాలున్న ప్రాజెక్ట్‌ల‌లో ఇది ఒక‌టి. సంచ‌ల‌న కాంబినేష‌న్‌గా క్రిటిక్స్ ప్ర‌శంస‌లు సైతం పొందింది ఈ చిత్రం. మురుగదాస్ వంటి విల‌క్ష‌ణ ఫిలిం మేక‌ర్‌.. సూప‌ర్‌స్టార్‌తో క‌లిసి పనిచేయ‌డం నిజంగానే ఓ గొప్ప కాంబో. అందుకే, ఈ కాంబోకి 100 కోట్ల బ‌డ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యారు నిర్మాత‌లు. అంత‌కుమించి ఇన్వెస్ట్ చెయ్య‌డానికి కూడా సై అంటున్నారు.నిర్మాత‌లు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ఈ సినిమాకి డిస్ట్రిబ్యూట‌ర్‌ల నుంచి భారీగా ఆఫ‌ర్‌లు వస్తున్నాయి. తెలుగు రాష్ర్టాల‌నుంచే ఈ మూవీకి సంచ‌ల‌న కొటేష‌న్‌లు అందుతున్నాయట నిర్మాత‌ల‌కు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌క్కువ టైమ్‌లోనే బ‌డా డిస్ట్రిబ్యూషన్ సంస్థ‌గా పేరొందిన అభిషేక్ పిక్చ‌ర్స్‌.. మ‌హేష్‌-మురుగ‌దాస్ సినిమా కోసం క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్ ఇచ్చార‌ని స‌మాచారం.

సీడెడ్‌, మిన‌హా కోస్తా, నైజాం ఏరియా క‌లిపి సుమారు 65 కోట్ల‌కు రెడీ అయ్యార‌నే టాక్ వినిపిస్తోంది. ఇది మొద‌టి ఆఫ‌ర్ మాత్ర‌మేన‌ట‌. నిర్మాత‌లు అంగీకరిస్తే.. మరో నాలుగయిదు కోట్లు వెచ్చించ‌డానికి కూడా సై అంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంటే, సుమారు 70 కోట్లు. అందులోనూ సీడెడ్‌ని మిన‌హాయించి. ఇది బ‌డా ఆఫర్ అనే టాక్ వినిపిస్తోంది.మహేష్ టాలీవుడ్ టాప్ హీరో. అందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీమంతుడు చిత్రంతో ఆయ‌న మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ అయింది. అయితే, దానికి గ‌జిని, కత్తి, స్టాలిన్ వంటి సంచ‌ల‌న చిత్రాల ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ యాడ్ కావ‌డంతో మ‌రింత హైప్ వచ్చింది. సీడెడ్ కూడా దాదాపు 15 కోట్ల మార్కెట్ ద‌క్కుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇటు ఓవర్సీస్‌లో ఈ చిత్రం 20 కోట్లు ప‌లికే చాన్స్ ఉంది. డాలర్ మార్కెట్‌లో టాలీవుడ్ కింగ్ మ‌హేష్ బాబు. బాహుబ‌లి త‌ర్వాత ఆయ‌న‌దే రికార్డ్‌. తెలుగు హ‌క్కుల‌తోపాటు త‌మిళ్ రైట్స్ కూడా కలిసి ఈ రేంజ్‌లో ప‌లుకుతుంద‌ని భావిస్తున్నారు.మ‌రోవైపు, త‌మిళ్‌, క‌న్న‌డ, మ‌ల‌యాళంలో మ‌హేష్‌-మురుగ‌దాస్ మూవీ మ‌రో 25-30 కోట్ల బిజినెస్ జ‌రుగుతుంద‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇక, శాటిలైట్ హ‌క్కులు అన్ని భాష‌ల‌లో క‌లిపి 25 కోట్లు ప‌లికే చాన్స్ ఉంది. అంటే, దాదాపు 150-170 కోట్ల బిజినెస్ జ‌ర‌గ‌నుంద‌ట ఈ సినిమా చుట్టూ. మ‌రి, ఈ చిత్రం ఎలాంటి సంచ‌నాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Loading...

Leave a Reply

*