2 రోజుల్లో 100 కేజీల బంగారం కొన్న టాప్ ప్రొడ్యూస‌ర్‌…!

producer

టాలీవుడ్‌కి కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డుతున్నాయి. బ్లాక్ మ‌నీపై మోదీ ప్ర‌క‌టించిన స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్‌తో బ‌డా బాబుల గుండెలు గుభేల్ మంటున్నాయి. ముఖ్యంగా ఆ ప్ర‌భావం తెలుగు చిత్ర‌సీమ‌పైనా ప‌డింది. మోదీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌తో కాస్త ముందుగానే తేరుకున్న ఓ బ‌డా నిర్మాత‌. వెంట‌నే త‌న అకౌంటెంట్ నిపుణుల‌తో చ‌ర్చ‌లు మొద‌లు పెట్టాడ‌ట‌. పెద్ద మొత్తంలో న‌ల్ల‌ధ‌నం ఉండ‌డంతో ఏం చేయాల‌ని వారిని కోరాడ‌ట‌. దీనికి ఆ చార్టెర్డ్ అకౌంటెంట్ నిపుణులు చేసిన సూచ‌న‌లతో ముందుగా బంగారం కొనుగోలు చేశాడ‌ట‌.

ఈ రెండు రోజుల‌లో ఆ నిర్మాత ఏకంగా వంద కేజీల‌కు పైగా బంగారం కొన్న‌ట్లు టాలీవుడ్‌లో వార్తలు వ‌స్తున్నాయి. ఈ బంగారాన్ని త‌న అనుయాయుల‌కు కూడా ఇచ్చేలా కాస్త జాగ్ర‌త్త‌పడుతున్నాడ‌ట‌. ఇలా, చేతిలో ఉన్న 500, 1000 రూపాయ‌ల నోట్ల‌ను కొంత‌వ‌ర‌కు వైట్ చేసుకోగ‌లిగాడ‌ట‌. అయితే, ఆయ‌న ద‌గ్గ‌రున్న బ్లాక్ మ‌నీలో ఇది కేవ‌లం 2 శాతం కూడా ఉండ‌ద‌ట‌. మ‌రి, మిగిలిన సొమ్మును ఏం చెయ్యాలి..? ఏమో ముందు ముందు ఆర్ధిక నిపుణులు ఏదో ఒక మార్గం చూప‌క‌పోతారా..? అని ఆశ‌గా ఎదురుచూస్తున్నాడ‌ట‌. ఆ నిర్మాత‌కు సినిమా రంగంతోపాటు ప‌లు బిజినెస్‌ల‌లోనూ ఎంటర్ అయ్యాడ‌ట‌. రియ‌ల్ ఎస్టేట్‌లో రీసెంట్‌గా భారీగా ఇన్‌వెస్ట్ చేశాడ‌ని స‌మాచారం. మరి,ఈ రేంజ్‌లో బంగారం కొన్న ఆ నిర్మాత ఎవ‌ర‌బ్బా..?

Loading...

Leave a Reply

*